Telugu Global
Cinema & Entertainment

బోయ‌పాటి  ప్రీ లుక్ తోనే ఇర‌గ‌దీశాడు..!

బోయ‌పాటి శీను సినిమా అంటే  యాక్ష‌న్ చిత్రాలు ఇష్ట‌ప‌డే  వాళ్ల‌కు డ‌బుల్ ద‌మ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వుంటుంది.  అందుకు ఆయ‌న చేసిన సింహా,  లెజెండ్, వెంక‌టేష్ తో చేసిన  తుల‌సి, ర‌వితేజ తో చేసిన భ‌ద్ర చిత్రాలే  ఉద‌హార‌ణ‌. క‌థ‌, క‌థ‌నం విష‌యం తో పాటు..హీరోను  స‌న్నివేశ ప‌రంగా ఎలివేట్ చేయ‌డంలో  నెంబ‌ర్ వ‌న్ అనే చెప్పాలి.   బాల‌కృష్ణ తో  ఆయ‌న చేసిన రెండు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి.   లెజెండ్ చిత్రం త‌ర‌వాత […]

బోయ‌పాటి  ప్రీ లుక్ తోనే ఇర‌గ‌దీశాడు..!
X

బోయ‌పాటి శీను సినిమా అంటే యాక్ష‌న్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు డ‌బుల్ ద‌మ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వుంటుంది. అందుకు ఆయ‌న చేసిన సింహా, లెజెండ్, వెంక‌టేష్ తో చేసిన తుల‌సి, ర‌వితేజ తో చేసిన భ‌ద్ర చిత్రాలే ఉద‌హార‌ణ‌. క‌థ‌, క‌థ‌నం విష‌యం తో పాటు..హీరోను స‌న్నివేశ ప‌రంగా ఎలివేట్ చేయ‌డంలో నెంబ‌ర్ వ‌న్ అనే చెప్పాలి.

బాల‌కృష్ణ తో ఆయ‌న చేసిన రెండు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. లెజెండ్ చిత్రం త‌ర‌వాత బోయ‌పాటి యంగ్ హీరో అల్లు అర్జున్ తో స‌రైనోడు చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ లుక్ ఈ నెల 26న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే దానికి ముందు విడుద‌ల చేసిన ప్రి లుక్ అద‌రహో అనిపిస్తుంది.

లుక్ లో బ‌న్నీ కండలు తిరిగిన చేతులు.. ఓ చేతిలో ఓ ఆయుధం.. అది కూడా వెరైటీ ఆయుధం. పట్టుకోడానికి హ్యాండిల్‌ వున్న ఇనుప ‘గుండు’ ఆ ఆయుధం. బోయపాటి శ్రీను సినిమా అంటే సూపర్‌ మాస్‌ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఈ ప్రీ లుక్‌, బోయపాటి శ్రీను టేస్ట్‌కి తగ్గట్టుగా వుంది. అల్లు అరవింద్‌, గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రి లుక్కే ఇలా వుంటే.. ఫ‌స్ట్ లుక్ కెవ్వు కేక అనిపిస్తుంది అన‌డంలో డౌటే లేదు..!

First Published:  22 Jan 2016 7:02 PM GMT
Next Story