Telugu Global
Cinema & Entertainment

చైతూ కోసం సోగ్గాడు మాస్టర్ ప్లాన్

ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్నాడు నాగచైతన్య. అందుకే పెద్డోడికి ఎలాగైనా ఓ హిట్టివ్వాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడు. చైతూ తాజా సినిమాకు ఎలాంటి కాంపిటిషన్ లేకుండా చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో చైతూ కొత్త సినిమా… సాహసం శ్వాసగా సాగిపోను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలన్నీ ఈ నెలాఖరుకు దుకాణం సర్దేస్తాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇంత పోటీ ఉండదు. కాబట్టి… ఫిబ్రవరి మొదటివారంలో సాహసం శ్వాసగా […]

చైతూ కోసం సోగ్గాడు మాస్టర్ ప్లాన్
X
ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్నాడు నాగచైతన్య. అందుకే పెద్డోడికి ఎలాగైనా ఓ హిట్టివ్వాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడు. చైతూ తాజా సినిమాకు ఎలాంటి కాంపిటిషన్ లేకుండా చేయాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో చైతూ కొత్త సినిమా… సాహసం శ్వాసగా సాగిపోను విడుదల చేయాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలన్నీ ఈ నెలాఖరుకు దుకాణం సర్దేస్తాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇంత పోటీ ఉండదు. కాబట్టి… ఫిబ్రవరి మొదటివారంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఆడియోను విడుదల చేసి…. మూడు లేదా నాలుగో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు నాగ్.
నిజానికి ఈ సినిమాషూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. అత్యధిక థియేటర్ల దక్కించుకోవాలనే ఆలోచనతోనే ఇన్నాళ్లూ ఆపారు. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు నిర్మాతే అయినప్పటికీ…. ఇప్పుడు నాగార్జున సీన్ లోకి ఎంటరై, తెరవెనక మొత్తం చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. సో… అటు అఖిల్ తో పాటు ఇటు చైతూపై కూడా నాగ్ ఒకేసారి దృష్టిపెట్టాడటన్నమాట.
First Published:  22 Jan 2016 7:03 PM GMT
Next Story