Telugu Global
Cinema & Entertainment

పవన్‌ సినిమాలో రేణుదేశాయ్‌

ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా తర్వాత అతడు ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడనే క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. దాసరి నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నప్పటికీ…. ఈమధ్య కాలంలో దాసరి వైసీపీకి దగ్గరవ్వడంతో దర్శకరత్నతో సినిమాను పవన్ పక్కనపెట్టినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో …. మరో దర్శకుడు, నిర్మాతతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్న పవన్ కు… ఎస్ జే సూర్య మరోసారి […]

పవన్‌ సినిమాలో రేణుదేశాయ్‌
X
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా తర్వాత అతడు ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడనే క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. దాసరి నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నప్పటికీ…. ఈమధ్య కాలంలో దాసరి వైసీపీకి దగ్గరవ్వడంతో దర్శకరత్నతో సినిమాను పవన్ పక్కనపెట్టినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో …. మరో దర్శకుడు, నిర్మాతతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్న పవన్ కు… ఎస్ జే సూర్య మరోసారి కలిశాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఖుషి. మరోటి కొమరం పులి. ఈ రెండింటిలో ఖుషి సినిమా సూపర్ హిట్టయితే… కొమరం పులి అట్టర్ ఫ్లాప్. ఆ అనుభవాలతో ఇప్పుడు మూడో సినిమా ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే ఖుషి సినిమాకే సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అన్నట్టు ఈ ప్రాజెక్టులో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా భాగం పంచుకుంటుందని సమాచారం.
First Published:  22 Jan 2016 7:04 PM GMT
Next Story