Telugu Global
Cinema & Entertainment

"బాహుబలి" ఒక స్టుపిడ్‌ మూవీ- అలనాటి నటి నిప్పులు

బాహుబలి. ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. కాసుల కుంభవృష్టి కురిపించింది. ఆ సినిమా కలెక్షన్లు చూసిన తర్వాత విమర్శించేందుకు కూడా ఎవరూ శాసించలేదు. అయితే అలనాటి హీరోయిన్‌ జమున మాత్రం సినిమాపై నేరుగా విరుచుకుపడ్డారు. రాజమండ్రి వచ్చిన ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సినిమాలు చూడడం మానేసి చాలా కాలమైందన్నారు. అయితే తన మనవడు బలవంత పెట్టడంతో బాహుబలి సినిమాను చూశానని చెప్పారు. అంతటితో ఆగలేదామె.  బాహుబలి సినిమా ఓ స్టుపిడ్ […]

బాహుబలి ఒక స్టుపిడ్‌ మూవీ- అలనాటి నటి నిప్పులు
X

బాహుబలి. ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. కాసుల కుంభవృష్టి కురిపించింది. ఆ సినిమా కలెక్షన్లు చూసిన తర్వాత విమర్శించేందుకు కూడా ఎవరూ శాసించలేదు. అయితే అలనాటి హీరోయిన్‌ జమున మాత్రం సినిమాపై నేరుగా విరుచుకుపడ్డారు. రాజమండ్రి వచ్చిన ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సినిమాలు చూడడం మానేసి చాలా కాలమైందన్నారు. అయితే తన మనవడు బలవంత పెట్టడంతో బాహుబలి సినిమాను చూశానని చెప్పారు. అంతటితో ఆగలేదామె. బాహుబలి సినిమా ఓ స్టుపిడ్ మూవీ అని అనేశారు. ఆ సినిమాకు ఆ టైటిల్‌కు ఏమైనా సంబంధం ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. టెక్నికల్‌ అంశాలు మినహాయిస్తే ఆ సినిమాలో మరేమీ లేదని జమున తేల్చేశారు. అయితే హీరో ప్రభాస్‌ పాత్రను మాత్రం ఆమె మెచ్చుకున్నారు. హీరో పాత్ర మినహా మిగిలిన పాత్రల ఎంపిక సరిగా లేదని అభిప్రాయపడ్డారు. అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేయాల్సిందన్నారు.

అప్పట్లో సినిమా స్ర్కిప్ట్‌ను ప్రధాన నటులకు ముందుగానే అందజేసేవారని చెప్పారు. అప్పట్లో దర్శకనిర్మాతలు, నటులకు సామాజిక బాధ్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో హీరో ఎంతమందిని చంపాడు… హీరోయిన్ ఎంతగా ఎక్స్‌పోజ్ చేసింది అన్నదే ముఖ్యమైపోయిందని జమున విమర్శించారు. రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్వాహకులు జమునను ”నట తపస్విని” బిరుదుతో సన్మానించారు.

First Published:  23 Jan 2016 12:38 PM GMT
Next Story