Telugu Global
Others

అసలు నిజం చెప్పిన లోకేష్

గ్రేటర్‌లో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండడం, సీమాంధ్ర పార్టీగా టీడీపీ ఒక్కటే బరిలో ఉండడంతో తెలుగుదేశం- బీజేపీ కూటమి గెలుపైనా ఆ పార్టీల శ్రేణులు కాసింత నమ్మకంతోనే ఉన్నారు. అదృష్టం కలిసివస్తే గ్రేటర్ పీఠం తమదేనని కూడా కొందరు లెక్కలేసుకున్నారు. కానీ లోకేష్ అసలు విషయాన్ని బయటపెట్టారు. గ్రేటర్ పీఠం తమది కాదు అని పరోక్షంగా ప్రకటించారు. శుక్రవారం టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన లోకేష్ గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ కింగ్ మేకర్ అవుతుందని చెప్పారు. […]

అసలు నిజం చెప్పిన లోకేష్
X

గ్రేటర్‌లో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండడం, సీమాంధ్ర పార్టీగా టీడీపీ ఒక్కటే బరిలో ఉండడంతో తెలుగుదేశం- బీజేపీ కూటమి గెలుపైనా ఆ పార్టీల శ్రేణులు కాసింత నమ్మకంతోనే ఉన్నారు. అదృష్టం కలిసివస్తే గ్రేటర్ పీఠం తమదేనని కూడా కొందరు లెక్కలేసుకున్నారు. కానీ లోకేష్ అసలు విషయాన్ని బయటపెట్టారు. గ్రేటర్ పీఠం తమది కాదు అని పరోక్షంగా ప్రకటించారు. శుక్రవారం టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన లోకేష్ గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ కింగ్ మేకర్ అవుతుందని చెప్పారు. అంటే గ్రేటర్లో టీడీపీ కింగ్ కాదు… కింగ్‌ను నిలబెట్టే పాత్ర మాత్రమే పోషించబోతోందన్న మాట.

పోరు హోరాహోరీగా సాగితే కొన్ని సార్లు అతి తక్కువ స్థానాలు కూడా కీలకం అవుతాయి. అలాంటి పార్టీలు కూడా ఆ సమయంలో కింగ్ మేకర్ అవుతాయి. అంటే మరో పార్టీ వ్యక్తికి మేయర్ పీఠం దక్కేలా సాయపడే స్థానాలు మాత్రమే టీడీపీకి వస్తాయని లోకేష్ మానసికంగా సిద్ధమయ్యారా అన్న అనుమానం పార్టీ నేతల్లో కలుగుతోంది. మరో విషయం ఏమిటంటే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో లోకేష్ మాట వరుసకు కూడా చెప్పలేదు. కేటీఆర్‌ సవాల్‌ను కూడా రేవంత్ మెడకు చుట్టి వదిలేశారు. టీఆర్ఎస్ వంద డివిజన్లలో గెలుస్తుందని కేటీఆర్‌ చెప్పారని అందుకు రేవంత్ రెడ్డి కూడా ప్రతిసవాల్ విసిరారని లోకేష్ గుర్తు చేశారు. రేవంత్ విసిరిన సవాల్‌కు కేటీఆర్ సిద్ధంగా ఉండాలని ఒకవేళ టీఆర్‌ఎస్ వంద స్థానాలు గెలువకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. గ్రేటర్‌లో టీడీపీ తరపున ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఈనెల 24 నుంచి 31 తేది వరకు లోకేష్ ప్రచారం నిర్వహించనున్నారు. లోకేష్‌ ప్రచారానికి వస్తే పరిస్థితి తమకు మరింత అనుకూలంగా మారుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

First Published:  23 Jan 2016 10:34 PM GMT
Next Story