Telugu Global
Cinema & Entertainment

 బాల‌య్య ఫ్యాన్స్  లెక్క అదేనేమో..!

ఏ మాత్రం సస్పెన్స్ లేకుండా, తన వందో సినిమాలో కొడుకు మోక్షజ్ఞ నటించడానికి అవకాశం వుందని నందమూరి బాలకృష్ణ చెప్పేసారు. గతంలో నాగార్జున అలా కాదు..మనం సినిమా విడదలయ్యే వరకు జనాలకు తెలియదు..అఖిల్ అందులో కనిపిస్తాడని. కానీ బాలయ్య అసలు సినిమా మొదలు కాకుండానే చెప్పేసారు అసలు విషయం..ఎందుకిలా అన్నదానిపై టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ అభిమానుల నుంచి పార్టీ వర్గాల నుంచి వత్తిడి పెరుగుతోందన్నది ఓ గుసగుస. నందమూరి ఫ్యాన్స్ […]

 బాల‌య్య ఫ్యాన్స్  లెక్క అదేనేమో..!
X

ఏ మాత్రం సస్పెన్స్ లేకుండా, తన వందో సినిమాలో కొడుకు మోక్షజ్ఞ నటించడానికి అవకాశం వుందని నందమూరి బాలకృష్ణ చెప్పేసారు. గతంలో నాగార్జున అలా కాదు..మనం సినిమా విడదలయ్యే వరకు జనాలకు తెలియదు..అఖిల్ అందులో కనిపిస్తాడని. కానీ బాలయ్య అసలు సినిమా మొదలు కాకుండానే చెప్పేసారు అసలు విషయం..ఎందుకిలా అన్నదానిపై టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ అభిమానుల నుంచి పార్టీ వర్గాల నుంచి వత్తిడి పెరుగుతోందన్నది ఓ గుసగుస. నందమూరి ఫ్యాన్స్ కు బాలకృష్ణ అంటే ఎంత అభిమానం వున్నా, యంగ్ జనరేషన్ సినిమాలు చూసిన కళ్లతో, ఆయన సినిమాలు చూడడం కష్టమవుతోంది. నిన్నటి బాలయ్య అభిమానులే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులుగా కూడా వున్నారు. వీళ్లే రేపు మోక్షజ్ఞ అభిమానులుగా కూడా వుంటారు. అందుకే బాలకృష్ణ వందో సినిమా సూపర్ సక్సెస్ కావాలంటే ఒక అదనపు అట్రాక్షన్ కావాలి. అదే మోక్షజ్ఞ అని బాలయ్యకు సలహాలు అందుతున్నాయి.

మరోపక్క మెగా హీరోలు అరడజను మంది వరకు వున్నారు. ఇటుపక్క బ్యాలెన్స్ తక్కువగా వుంది. ఎన్టీఆర్,మహేష్ మాత్రమే క్రౌడ్ పుల్లర్లుగా వున్నారు. చైతన్య, అఖిల్ ఇంకా నిలదొక్కుకోవాలి. అందుకే ఇలాంటి టైమ్ లో మోక్షజ్ఞను తీసుకురావాలని కూడా సలహాలు అందుతున్నట్లు వినికిడి. సో..ఓ ట్రయిలర్ మాదిరిగా బాలకృష్ణ వందో సినిమాలో మోక్షజ్ఞ కనిపిస్తే, తరువాత సోలో ఎంట్రీకి ఏర్పాట్లు చేసేయచ్చు.

First Published:  23 Jan 2016 7:02 PM GMT
Next Story