Telugu Global
Cinema & Entertainment

మంచు తుఫానులో కలెక్షన్ల సునామీ

ఎన్టీఆర్ అనుకున్నది సాధించాడు. ఓవర్సీస్ వసూళ్లలో పవన్ కల్యాణ్ ను దాటేశాడు. ఓవైపు అమెరికాలో మంచు తుఫాను విధ్వసం సృష్టిస్తున్నప్పటికీ… తారక్ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ల ముందు క్యూ కట్టారు. దీంతో నాన్నకు ప్రేమతో వసూళ్లు… అత్తారింటికి దారేది సినిమాను క్రాస్ చేసేశాయి. అలా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా నాన్నకు ప్రేమతో చిత్రం మిగిలింది. మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లాలనుకున్న తారక్ కల నెరవేరడమే కాదు… ఇప్పుడు ఏకంగా 2 […]

మంచు తుఫానులో కలెక్షన్ల సునామీ
X
ఎన్టీఆర్ అనుకున్నది సాధించాడు. ఓవర్సీస్ వసూళ్లలో పవన్ కల్యాణ్ ను దాటేశాడు. ఓవైపు అమెరికాలో మంచు తుఫాను విధ్వసం సృష్టిస్తున్నప్పటికీ… తారక్ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ల ముందు క్యూ కట్టారు. దీంతో నాన్నకు ప్రేమతో వసూళ్లు… అత్తారింటికి దారేది సినిమాను క్రాస్ చేసేశాయి. అలా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా నాన్నకు ప్రేమతో చిత్రం మిగిలింది. మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లాలనుకున్న తారక్ కల నెరవేరడమే కాదు… ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి కూడా ఎంటరయ్యేందుకు దూసుకుపోతున్నాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి మరో 4 రోజులు కనుక నాన్నకు ప్రేమతో సినిమా అమెరికాలో ఆడితే… తారక్ 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైపోయినట్టే. ఆ శుభ ఘడియల కోసం తారక్ తో పాటు టోటల్ అభిమాన వర్గమంతా ఎదురుచూస్తోంది.
First Published:  24 Jan 2016 7:08 PM GMT
Next Story