రామ్ చరణ్ కు రీమేకుల పిచ్చి

ఒకేసారి రీమేకులపై పడ్డాడు రామ్ చరణ్. త్వరలోనే తండ్రి మెగాస్టార్ ను హీరోగా పెట్టిన ఓ రీమేక్ సినిమాను నిర్మించనున్నాడు. తను కూడా తమిళ్ లో హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాను రీమేక్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది ఆ మూవీ. ఈ గ్యాప్ లో మరో రీమేక్ మూవీ కోసం ప్రయత్నిస్తున్నాడు చెర్రీ. బాలీవుడ్ లో త్వరలోనే విడుదలకాబోతున్న ఓ సినిమాపై చెర్రీ కన్ను పడింది.
జాన్ అబ్రహాం-శృతిహాసన్ జంటగా రాకీ హ్యాండ్సమ్ అనే హిందీ సినిమా తెరెక్కింది. కంప్లీట్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా కూడా జాన్… థాయ్ లాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాను టాలీవుడ్ లో రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తంచేశాడు. ఆ వెంటనే సీన్ లోకి చెర్రీ ఎంటరయ్యాడు. జాన్ తో చర్చలు జరిపాడు. సినిమా గురించి ఆరా తీశాడు. ఎడిట్ ల్యాబ్ లో కొన్ని సన్నివేశాలు కూడా చూశాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాకీ హ్యాండ్సమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ ఉన్నాడని సమాచారం.