Telugu Global
POLITICAL ROUNDUP

భార‌తీయ మ‌గాడికి... మంచిధ‌ర‌!

విన‌డానికి కాస్త అశ్లీలంగా వినిపించినా సాంకేతికంగా ఈ ప‌దాల్లో ఎలాంటి నిగూఢార్థం లేదు. సంతాన‌లేమికి అత్యాధునిక సాంకేతికత‌తో ప‌రిష్కారాలు అందిస్తున్న వైద్య రంగంలో, భార‌త పురుషుల వీర్య క‌ణాల‌కు మంచి ధ‌ర ఉంద‌ట‌. ఇదే అందులో ఉన్న విష‌యం. అమెరికా మ‌గ‌వారికి ఇప్ప‌టికే ఇలాంటి పేరుంది. అమెరికాకు చెందిన దాత నుండి సేక‌రించిన వీర్య‌క‌ణాల‌కు ధ‌ర రానురాను విప‌రీతంగా పెరుగుతోంది. ఒక చిన్న‌పాటి గాజు బీక‌రు (వియ‌ల్‌)లో భ‌ద్ర‌ప‌ర‌చిన వీర్య‌క‌ణాల‌(స్పెర్మ్‌)కు ప్ర‌స్తుతం 370 డాల‌ర్ల‌నుండి 890 డాల‌ర్ల వ‌ర‌కు ధ‌ర ఉంది. ఒక ద‌శాబ్దం క్రిత‌మైతే […]

భార‌తీయ మ‌గాడికి... మంచిధ‌ర‌!
X

విన‌డానికి కాస్త అశ్లీలంగా వినిపించినా సాంకేతికంగా ఈ ప‌దాల్లో ఎలాంటి నిగూఢార్థం లేదు. సంతాన‌లేమికి అత్యాధునిక సాంకేతికత‌తో ప‌రిష్కారాలు అందిస్తున్న వైద్య రంగంలో, భార‌త పురుషుల వీర్య క‌ణాల‌కు మంచి ధ‌ర ఉంద‌ట‌. ఇదే అందులో ఉన్న విష‌యం. అమెరికా మ‌గ‌వారికి ఇప్ప‌టికే ఇలాంటి పేరుంది. అమెరికాకు చెందిన దాత నుండి సేక‌రించిన వీర్య‌క‌ణాల‌కు ధ‌ర రానురాను విప‌రీతంగా పెరుగుతోంది. ఒక చిన్న‌పాటి గాజు బీక‌రు (వియ‌ల్‌)లో భ‌ద్ర‌ప‌ర‌చిన వీర్య‌క‌ణాల‌(స్పెర్మ్‌)కు ప్ర‌స్తుతం 370 డాల‌ర్ల‌నుండి 890 డాల‌ర్ల వ‌ర‌కు ధ‌ర ఉంది. ఒక ద‌శాబ్దం క్రిత‌మైతే ఈ ధ‌ర 200 డాల‌ర్లుగా ఉంది. అయితే ఇప్పుడు భార‌తీయ పురుషుల స్పెర్మ్‌ కూడా ఎక్కువ ధ‌ర ప‌లుకుతోంది. ఐదేళ్ల క్రితం ఒక్క వియ‌ల్‌ స్పెర్మ్ ధ‌ర 1200 రూపాయ‌ల నుండి 1500 రూ. వ‌ర‌కు ఉండ‌గా, ఇప్పుడు 2000 రూ. ల‌నుండి 5000రూ.ల వ‌ర‌కు ఉంటున్న‌ది. నాణ్య‌త‌ని బ‌ట్టి పెరిగే కూర‌గాయ‌ల ధ‌ర‌ల్లా, వ్య‌క్తి చ‌దువు, తెలివితేట‌లు స్పెర్మ్ ధ‌ర‌ని నిర్ణ‌యిస్తున్నాయి. మెడిక‌ల్‌ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న వ్య‌క్తి నుండి సేక‌రించే శాంపిల్ ఎక్కువ ధ‌ర ప‌లుకుతోంది. మ‌హిళ సంతానం కోసం ఒక్క‌సారి ఐవిఎఫ్‌కి వెళితే ఒక వియ‌ల్‌ స్పెర్మ్ కావాల్సి ఉంటుంది. గ‌ర్భం దాల్చాలంటే ఇలాంటి ప్ర‌య‌త్నాలు రెండు, మూడు చేయాల్సి ఉంటుంది.

త్వ‌ర‌లోనే ఒక్క త‌డ‌వ సేక‌రించే స్పెర్మ్ ధ‌ర 10వేల రూపాయ‌ల‌కు చేరుతుంద‌ని ద‌క్షిణ ఢిల్లీలో ఫెర్టిలిటీ క్లినిక్ న‌డుపుతున్న డాక్ట‌ర్ రీటా బ‌క్షీ అంటున్నారు. స్పెర్మ్ బ్యాంకులో చేసిన టెస్టులు కాక, తాము వివిధ ర‌కాల జెన‌టిక్ టెస్టుల‌ను నిర్వ‌హిస్తున్నందు వ‌ల‌న ఈ ధ‌ర మ‌రింత‌గా పెరుగుతోంద‌ని ఆమె చెబుతున్నారు. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చి గ‌త ఏడాది అక్టోబ‌రులో ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం, సేక‌రించిన స్పెర్మ్‌కి చేయాల్సిన ప‌రీక్ష‌లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. హెచ్ఐవి, హెప‌టైటిస్ బి, సి, హైప‌ర్ టెన్ష‌న్‌, డ‌యాబెటిస్‌, సెక్సువ‌ల్లీ ట్రాన్స్‌మిటెడ్ వ్యాధులతో పాటు త‌ల‌సీమియా లాంటి జ‌న‌టిక్ డిజార్డ‌ర్లు…ఇవేమీ లేవ‌ని నిర్దారించుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప‌రీక్ష‌ల‌ను దాత‌ల నుండి సేక‌రించిన స్పెర్మ్‌కి చేయాల్సి ఉంది.

ఈ ప‌రీక్ష‌ల‌న్నీ పూర్త‌య్యే స‌రికి క‌నీసం ఆరునెల‌ల కాలం ప‌డుతోంది. పిల్ల‌లు కావాల‌నుకుంటున్న జంట‌లు ఇలాంటి ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు సిద్ధంగా ఉంటున్నార‌ని ముంబ‌యిలో ఐవిఎఫ్ సెంట‌ర్‌ని నిర్వ‌హిస్తున్న డాక్ట‌ర్ అనిరుధ్ మాల్‌ప‌నీ అన్నారు. ఐఐటి చ‌దువు, ఆర‌డుగుల ఎత్తు…ఇలా తాము కోరుకున్న అర్హ‌త‌లున్న దాత‌ల స్పెర్మ్ కావాల‌ని కొంత‌మంది ప్ర‌త్యేకంగా అడుగుతుంటార‌ని అనిరుధ్ అన్నారు. అదే ప‌ట్ట‌ణాలు, చిన్న న‌గ‌రాల్లో అయితే ఇలాంటి కోరిక‌లు ఉండ‌వ‌ని, వారు ఆరోగ్యంగా ఉన్న‌ బిడ్డ అయితే చాల‌ని అడుగుతున్నార‌ని ఆయ‌న తెలిపారు.

స్పెర్మ్‌ని దానం చేయ‌డానికి చాలామంది దాత‌లు ముందుకు వ‌స్తున్నా, నాణ్య‌త‌ ప‌రంగా త‌మ‌కు అనుకూలంగా అనిపించేవారి సంఖ్య నెల‌కు 25నుండి 30వ‌ర‌కు మాత్ర‌మే ఉంటున్న‌ద‌ని గుజ‌రాత్, రాజ్‌కోట్‌లో అగ‌స్త్య స్పెర్మ్ బ్యాంక్‌ని న‌డుపుతున్న యోగేష్ చోక్సీ అంటున్నారు. 1997లో ఆయ‌న క్లినిక్‌ని మొద‌లుపెట్టారు. ఆరోజుల‌తో పోల్చి చూస్తే వీర్య‌క‌ణాల కౌంట్ మ‌గ‌వారిలో బాగా త‌గ్గిపోయింద‌ని యోగేష్ అన్నారు. స్పెర్మ్ ధ‌ర పెరిగిపోవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణంగా యోగేష్ పేర్కొన్నారు. స్పెర్మ్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆన్‌లైన్ మార్కెట్ ఉంది. ఇందులో తెలివితేట‌లుండి, ప్ర‌శాంతంగా, కూల్‌గా, కాస్త సిగ్గ‌రిగా ఉన్న మ‌గ‌వారికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంద‌ని ఒక నూత‌న అధ్య‌య‌నం చెబుతోంది.

First Published:  28 Jan 2016 3:52 AM GMT
Next Story