Telugu Global
Others

బాలయ్య వందో సినిమాకు ఎన్టీఆర్ టైటిల్

  తన కెరీర్ తో పాటు… జీవితంలోనే అత్యంత అరుదైన, అందమైన, ప్రత్యేకమైన అనుభవం వందో సినిమా. అలాంటి సందర్భాన్ని అపూరూపంగా మార్చుకునేందుకు దగ్గర్లో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలని చూస్తున్నాడు బాలయ్య. అందులో భాగంగా… తన వందో సినిమాకు తండ్రిగారి పాత సినిమాల్లోంచి ఓ సూపర్ హిట్ టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య. సో…. బాలయ్య వందో సినిమాకు నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టడమనేది […]

బాలయ్య వందో సినిమాకు ఎన్టీఆర్ టైటిల్
X
తన కెరీర్ తో పాటు… జీవితంలోనే అత్యంత అరుదైన, అందమైన, ప్రత్యేకమైన అనుభవం వందో సినిమా. అలాంటి సందర్భాన్ని అపూరూపంగా మార్చుకునేందుకు దగ్గర్లో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలని చూస్తున్నాడు బాలయ్య. అందులో భాగంగా… తన వందో సినిమాకు తండ్రిగారి పాత సినిమాల్లోంచి ఓ సూపర్ హిట్ టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య. సో…. బాలయ్య వందో సినిమాకు నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టడమనేది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆదిత్య-369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య-999 పేరుతో తన వందో సినిమాను తెరకెక్కించాలని మొన్నటివరకు బాలయ్య భావించారు. అయితే ఇప్పుడు ఆదిత్య-999 స్థానంలో సీనియర్ ఎన్టీఆర్ సినిమా టైటిల్ రాబోతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. తనకు కలిసొచ్చిన నయనతారను మరోసారి తీసుకోవాలనే ఉద్దేశంలో బాలయ్య ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్ ఎవరనే అంశపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం యూనిట్ అంతా టైటిల్ పై కసరత్తు చేస్తోంది.
First Published:  28 Jan 2016 10:45 PM GMT
Next Story