Telugu Global
Cinema & Entertainment

"గవర్నమెంట్" పై వర్మ టార్గెట్

మాఫియా సినిమాలు తీయ‌డంలో వర్మాను మించిన వాళ్లు ఇంత వ‌ర‌కు రాలేదు. స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్ చిత్రాలు అందుకు నిద‌ర్శ‌నం.ఇప్పుడు మ‌ళ్లీ మాఫియా నేప‌థ్యంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ”గ‌వ‌ర్నమెంట్” పేరు తో ఓ సినిమాని హిందీలో రూపిందించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. మాఫియా డాన్ లు దావూద్ ఇబ్ర‌హీమ్, ఛోటా రాజ‌న్ ల మ‌ధ్య నెల‌కొన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు.. వాళ్లిద్ద‌రు విడిపోయాక పుట్ట‌గొడుగుల్లా వ‌చ్చిన ఛోటా ఛోటా డాన్ లు.. హ‌ఠాత్తుత‌గా అబూ స‌లేమ్ డాన్ గా ఎద‌గ‌డం.. […]

గవర్నమెంట్ పై వర్మ టార్గెట్
X

మాఫియా సినిమాలు తీయ‌డంలో వర్మాను మించిన వాళ్లు ఇంత వ‌ర‌కు రాలేదు. స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్ చిత్రాలు అందుకు నిద‌ర్శ‌నం.ఇప్పుడు మ‌ళ్లీ మాఫియా నేప‌థ్యంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ”గ‌వ‌ర్నమెంట్” పేరు తో ఓ సినిమాని హిందీలో రూపిందించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. మాఫియా డాన్ లు దావూద్ ఇబ్ర‌హీమ్, ఛోటా రాజ‌న్ ల మ‌ధ్య నెల‌కొన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు.. వాళ్లిద్ద‌రు విడిపోయాక పుట్ట‌గొడుగుల్లా వ‌చ్చిన ఛోటా ఛోటా డాన్ లు.. హ‌ఠాత్తుత‌గా అబూ స‌లేమ్ డాన్ గా ఎద‌గ‌డం.. వంటి అంశాల‌తో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. ఈ మూడు పాత్ర‌ల‌తో పాటు.. ప్రధాన మంత్రి మ‌న్మోహాన్ సింగ్, శివ‌సేన అధినేత దివంగ‌త బాల్ థాక‌రే, నేష‌న‌ల్ కాంగ్రేస్ పార్టీ అధ్య‌క్ష‌కుడు శ‌ర‌ద్ ప‌వార్, నటి మోనిక బేడి, ఛోటా రాజ‌న్ స‌తీమ‌ణి సుజాత‌, ఇలా పలువురి జీవితాల‌ను ఈ చిత్రంలో చూపించే ఆలోచ‌న చేస్తున్నారట. దావూద్ ఇబ్ర‌హామ్, ఛోట‌రాజ‌న్ ల జీవితం ఆధారంగా కంపెనీ చిత్రం తీసిన‌ప్ప‌టికి అది కల్పిత‌ క‌థ అని..గ‌వ‌ర్న్ మెంట్ చిత్రం స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని వ‌ర్మ చెప్పుకొస్తున్నారు. అంటే త్వ‌ర‌లో వ‌ర్మ మ‌ల్టీ యాక్ట‌ర్స్‌తో ”గ‌వ‌ర్నమెంట్”తో బాక్సాఫీస్ మీద‌కు దండెత్తుతున్నాడ‌న్న‌మాట‌.

First Published:  30 Jan 2016 7:03 PM GMT
Next Story