Telugu Global
Cinema & Entertainment

హ్యాపిడేస్ డైరెక్ట‌ర్‌కు నిజంగా ఇది పెద్ద ప‌రీక్షే మ‌రి...

సినిమా అంటే  ఒక ప‌వ‌ర్ ఫుల్  మీడియా  .  సినిమా అంటే కేవ‌లం బిజినెసే కాదు. దానికి ఒక సామాజిక ప్ర‌యోజ‌నం ఉంద‌ని న‌మ్మిన ద‌ర్శ‌కుల్లో   శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఆయ‌న చేసినవి కొన్ని చిత్రాలే అయిన‌ప్ప‌టికి..  చాలా సెన్సిటివ్  పాయింట్స్ ను ట‌చ్ చేస్తూ హ్యాపిడేస్..  లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలు చేశారు. ఆనంద్ వంటి సినిమా లో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి  వ్య‌క్తిత్వాన్ని  ..స్వ‌తంత్ర భావాల్ని బాగా ఆవిష్క‌రించారు.  క‌ట్ చేస్తే లైఫ్ […]

హ్యాపిడేస్ డైరెక్ట‌ర్‌కు నిజంగా ఇది పెద్ద ప‌రీక్షే మ‌రి...
X

సినిమా అంటే ఒక ప‌వ‌ర్ ఫుల్ మీడియా . సినిమా అంటే కేవ‌లం బిజినెసే కాదు. దానికి ఒక సామాజిక ప్ర‌యోజ‌నం ఉంద‌ని న‌మ్మిన ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఆయ‌న చేసినవి కొన్ని చిత్రాలే అయిన‌ప్ప‌టికి.. చాలా సెన్సిటివ్ పాయింట్స్ ను ట‌చ్ చేస్తూ హ్యాపిడేస్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలు చేశారు. ఆనంద్ వంటి సినిమా లో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి వ్య‌క్తిత్వాన్ని ..స్వ‌తంత్ర భావాల్ని బాగా ఆవిష్క‌రించారు.

క‌ట్ చేస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం రిజ‌ల్ట్ నెగిటివ్ గా రావ‌డంతో.. వెంట‌నే త‌న సొంత టాలెంట్ ను ప‌క్క‌న పెట్టి బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన క‌హాని సినిమాను న‌య‌న‌తార లీడ్ రోల్ లో రీమేక్ చేశాడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా అంత‌గా వెళ్ల‌లేదు. దీంతో తాజాగా హ్యాపిడేస్ సినిమాను హిందిలో రీమేక్ చే్స్తున్నాడు. స‌ల్మాన్ ఖాన్ తో క‌ల‌సి ఈ చిత్రాన్ని శేఖ‌ర్ క‌మ్ము‌ల హిందీలో చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ..శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్ న‌గ‌ర్ లో షికారు చేస్తుంది. మ‌హేష్ బాబు వంటి క‌మ‌ర్షియ‌ల్ హీరోను శేఖ‌ర్ క‌మ్ముల ఎంత వ‌ర‌కు డీల్‌ చేయ‌గ‌లడు అనేది ఒక ఆందోళ‌న ఫ్యాన్స్ లో క‌నిపిస్తుంది అంటున్నారు ప‌రిశీలకులు. ఇదిలా వుంటే.. శేఖ‌ర్ కు సినిమా ఇవ్వాలా లేదా అనేది హ్యాపిడేస్ రీమేక్ స‌క్సెస్ ను బ‌ట్టే మ‌హేష్ ఫైన‌ల్ చేసుకుంటాడ‌నే న్యూస్ వినిపిస్తుంది. ఒక వేళ ఇదే నిజ‌మైతే శేఖ‌ర్ క‌మ్ముల‌కు నిజంగా ప‌రీక్షా స‌మ‌య‌మే క‌దా.!

First Published:  31 Jan 2016 7:06 PM GMT
Next Story