అద్దంలో చూసుకో జగన్!

వంగవీటి రంగాను హత్య చేయించిన కోడెల శివప్రసాదరావును స్పీకర్‌ను చేసిన క్రిమినల్ చరిత్ర చంద్రబాబుదని వైసీపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కోడెల తీవ్రంగా స్పందించారు. వారానికొకసారి కోర్టు బోనులో నిలబడే జగన్‌ రాజకీయ విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిమినల్ అన్న పదానికి చొక్కా తొడిగితే అది జగనేనని విమర్శించారు.

రంగాతో తనకు స్నేహం గానీ, వైరం గానీ లేదని కోడెల చెప్పారు. రంగా హత్య తర్వాత దాడులు, లూటీలు జరిగాయని అందుకు మనస్తాపం చెంది హోంశాఖ పదవికి రాజీనామా చేశానని కోడెల గుర్తు చేశారు. జగన్‌ ప్రోత్సహించిన రౌడీ మూకలే తునిలో విధ్వంసం సృష్టించాయని జనం అనుకుంటున్నారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో నేరాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగనేనని కోడెల ఫైర్ అయ్యారు. జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదన్నారు కోడెల. అద్దం ముందు కూర్చుంటే నేరస్థులు ఎవరో జగన్‌కు కనిపిస్తారన్నారు.

కోడెల వ్యాఖ్యలకు స్పందించిన వైసీపీ వర్గాలు ఎన్నికల సమయంలో ఎవరిఇంట్లో బాంబులు పేలాయో, గుంటూరు జిల్లా హత్యారాజకీయాల్లో ఎవరు పేరు మోసినవారో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

ఈ మాత్రానికి కేరళ నుంచి రావాలా…తమ్ముడూ!

హంతకుడిని స్పీకర్‌ చేశావ్… క్రిమినల్ నువ్వా నేనా?

ధ్వజమెత్తిన చిరు.. విజయశాంతి మద్దతు

రౌడీలకు ట్రైనింగ్ ఇచ్చి పంపారు. వాటికి నిధులెక్కడివి?

కాపుల్లో ఇంత మార్పా?

కాసేపు కంగారు పడ్డ టీవీ చానళ్లు

ఆయన సలహా విని ఉంటే ఇలా జరిగేది కాదేమో?

ఇప్పుడేమంటారు?

భలే వాడేశావ్ బాస్‌..!

ఆడోళ్లతో కొట్టిస్తా..!, దా ఎంతమందిని కొట్టిస్తావో..!