Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కల నిజమైన వేళ‌

ఏ హీరో స్టార్ డ‌మ్ అయినా అత‌ని బాక్సాఫీస్ స్టామినా మీదనే ఆధారపడి ఉంటుంది. అస‌లు స్టార్ డ‌మ్ అంటేనే బాక్సాఫీస్ బిజినెస్.ఈ బిజినెస్ లో ఎప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రి బ‌ల‌మెంత అనేది వాళ్లు న‌టించిన సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు లెక్క క‌డుతుంటారు. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో ఆది , సింహాద్రి, బాద్ షా చిత్రాలు క‌మర్షియ‌ల్ గా మంచి హిట్స్. అయితే ఎన్టీఆర్ న‌టించిన ఏ సినిమా కూడా నాన్నాకు ప్రేమ‌తో ముందు వ‌ర‌కు 50 […]

ఎన్టీఆర్ కల నిజమైన వేళ‌
X

ఏ హీరో స్టార్ డ‌మ్ అయినా అత‌ని బాక్సాఫీస్ స్టామినా మీదనే ఆధారపడి ఉంటుంది. అస‌లు స్టార్ డ‌మ్ అంటేనే బాక్సాఫీస్ బిజినెస్.ఈ బిజినెస్ లో ఎప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రి బ‌ల‌మెంత అనేది వాళ్లు న‌టించిన సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు లెక్క క‌డుతుంటారు. అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో ఆది , సింహాద్రి, బాద్ షా చిత్రాలు క‌మర్షియ‌ల్ గా మంచి హిట్స్. అయితే ఎన్టీఆర్ న‌టించిన ఏ సినిమా కూడా నాన్నాకు ప్రేమ‌తో ముందు వ‌ర‌కు 50 కోట్లు వ‌సూలు చేయ‌లేదు.

కానీ తాజాగా సంక్రాంతి పండ‌గ రేసు లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన నాన్నాకు ప్రేమ‌తో చిత్రం 50 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన‌ట్లు టాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ‌ర్స్ తేల్చారు. సినిమా ప్రొడ్యూస‌ర్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న ఏది రాక‌పోయిన‌ప్ప‌టికి.. అనధికారికంగా ఈ చిత్రం 50 కోట్ల క్ల‌బ్ లో చేరింద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో రెండు మిలియ‌న్ల క‌లెక్ష‌న్స్ రెండు వారాల్లోనే వసూలు చేయ‌డం విశేషం. సినిమా ప్ర‌చార చిత్రాల విడుదల‌ నుంచి మంచి పాజిటివ్ ఇంప్రెష‌న్ ప‌డ‌టం ప్ల‌స్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ అయిన త‌రువాత మిశ్ర‌మ స్పంద‌న వినిపించింది. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా ఒక వారం త‌రువాత డ‌ల్ అయిపోతుందేమోనని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ప్ర‌చారం బాగా చేయ‌డం.. ఎక్కువ పాజిటివ్ టాక్ ఉండ‌టం క‌ల‌సొచ్చాయి. దీంతో ఎన్టీఆర్ కెరీర్ లో త‌న చిత్రం 50 కోట్ల క్ల‌బ్ లో చేరాల‌నే డ్రీమ్ నిజం అయ్యింది. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు.. రాజేంద్ర ప్ర‌సాద్ , కీ రోల్స్ పోషించ‌గా.. రాజీవ్ క‌న‌కాల‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఎన్టీఆర్ బ్ర‌ద‌ర్స్ గా న‌టించారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్‌.. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించిన విష‌యం తెలిసిందే.

Click on Image to Read:

నా మనస్సును మెప్పించే “సరైనోడు” అతనే..

First Published:  31 Jan 2016 7:02 PM GMT
Next Story