Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కు బంపర్ ఆఫర్

బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో బాగానే పరిచయాలు పెంచుకున్నాడు ప్రభాస్. ఆ పరిచయాలతో ఇప్పుడో అద్భుతమైన ఆఫర్ అందిపుచ్చుకోబోతున్నాడు. హిందీలో సూపర్ హిట్ సిరీస్ గా పేరుతెచ్చుకున్న ధూమ్ సిరీస్ లో ప్రభాస్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో చిన్న విలన్ గా నటించమంటూ ప్రభాస్ కు ఆఫర్ వచ్చింది. నిజానికి ధూమ్ సిరీస్ లో విలన్ కే ప్రాధాన్యం ఎక్కువ. మొదట జాన్ అబ్రహాం విలన్ గా చేశాడు. తర్వాత హృతిక్ రోషన్ […]

ప్రభాస్ కు బంపర్ ఆఫర్
X
బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో బాగానే పరిచయాలు పెంచుకున్నాడు ప్రభాస్. ఆ పరిచయాలతో ఇప్పుడో అద్భుతమైన ఆఫర్ అందిపుచ్చుకోబోతున్నాడు. హిందీలో సూపర్ హిట్ సిరీస్ గా పేరుతెచ్చుకున్న ధూమ్ సిరీస్ లో ప్రభాస్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో చిన్న విలన్ గా నటించమంటూ ప్రభాస్ కు ఆఫర్ వచ్చింది. నిజానికి ధూమ్ సిరీస్ లో విలన్ కే ప్రాధాన్యం ఎక్కువ. మొదట జాన్ అబ్రహాం విలన్ గా చేశాడు. తర్వాత హృతిక్ రోషన్ విలన్ అయ్యాడు. ఈమధ్యే ధూమ్-3లో అమీర్ ఖాన్ కూడా విలన్ గా నటించాడు. ఇప్పుడు ధూమ్-4లో ప్రభాస్ కు అలా విలన్ గా నటించే ఆఫర్ వచ్చింది. అయితే మెయిన్ విలన్ గా హృతిక్ రోషన్ ఉంటాడు. ఓ ఛోటా విలన్ గా ప్రభాస్ కనిపిస్తాడన్నమాట. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్…. ఈ ఆఫర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
First Published:  31 Jan 2016 11:52 PM GMT
Next Story