Telugu Global
Cinema & Entertainment

సముద్ర గర్భంలో సోనాక్షి సిన్హా

ఈమధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్న సోనాక్షి సిన్హా…. సడెన్ గా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ప్రత్యక్షమైంది. బాగా సన్నబడిన సోనాక్షి సిహ్నా… తన స్లిమ్ ఫిజిక్ ఫొటోల్ని నెట్ లో పెట్టి హల్ చల్ చేసింది. అభిమానులు ఇంకా ఆ ఫొటోల్ని ఆస్వాదిస్తున్న టైమ్ లోనే… మరో షాక్ ఇచ్చింది సోనాక్షి. ఏకంగా సముద్రగర్భంలో తీసుకున్న ఫొటోలను పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాహస క్రీడలంటే సోనాక్షికి చిన్నప్పట్నుంచి ఇష్టం…. మంచులో స్కీయింగ్ చేయడం, […]

సముద్ర గర్భంలో సోనాక్షి సిన్హా
X
ఈమధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్న సోనాక్షి సిన్హా…. సడెన్ గా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ప్రత్యక్షమైంది. బాగా సన్నబడిన సోనాక్షి సిహ్నా… తన స్లిమ్ ఫిజిక్ ఫొటోల్ని నెట్ లో పెట్టి హల్ చల్ చేసింది. అభిమానులు ఇంకా ఆ ఫొటోల్ని ఆస్వాదిస్తున్న టైమ్ లోనే… మరో షాక్ ఇచ్చింది సోనాక్షి. ఏకంగా సముద్రగర్భంలో తీసుకున్న ఫొటోలను పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాహస క్రీడలంటే సోనాక్షికి చిన్నప్పట్నుంచి ఇష్టం…. మంచులో స్కీయింగ్ చేయడం, కొండలు ఎక్కడం, బైక్ రైడింగ్ లాంటి పనులు చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి ఈ అండర్ వాటర్ స్పోర్ట్ ను కూడా చేర్చేసింది. సముద్ర గర్భంలో విహరించమే కాకుండా…. అక్కడున్న ఓ స్టార్ ఫిష్ ను చేత్తో పట్టుకొని ఓ ఫొటో కూడా దిగింది. ఈ ఫొటోలన్నింటితో పాటు ఓ చిన్నపాటి వీడియోను కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసింది సోనాక్షి. ప్రస్తుతం ఈ భామ… మురుగదాస్ దర్శకత్వంలో అకిరా అనే సినిమాలో నటిస్తోంది.
Sonakshi
First Published:  31 Jan 2016 7:05 PM GMT
Next Story