Telugu Global
Cinema & Entertainment

బాధ్య‌త చాటుకున్న హీరోలు..

ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం ప్ర‌తి పౌరుని విధి. బాధ్య‌త‌. అయితే సెలిబ్రిటీలు మాత్రం ఎన్నికల స‌మ‌యంలో కొంద‌రు త‌మ‌కు న‌చ్చిన పార్టీల‌కు ప్ర‌చారం చేస్తుంటారు. అయితే ఓట్ వేసే స‌మ‌యానికి చాల త‌క్కువ మంది సెలిబ్రిటీలు మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకుంటారు. మ‌నం వేయక పోతే పోయేది ఏముందిలే అనే ధోర‌ణి ఎక్కువ మంది లో ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్స్ లో హీరో నాగార్జున‌, అయ‌న స‌తీమ‌ణి అమ‌ల‌.. అలాగే అల్లు […]

బాధ్య‌త చాటుకున్న హీరోలు..
X

ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం ప్ర‌తి పౌరుని విధి. బాధ్య‌త‌. అయితే సెలిబ్రిటీలు మాత్రం ఎన్నికల స‌మ‌యంలో కొంద‌రు త‌మ‌కు న‌చ్చిన పార్టీల‌కు ప్ర‌చారం చేస్తుంటారు. అయితే ఓట్ వేసే స‌మ‌యానికి చాల త‌క్కువ మంది సెలిబ్రిటీలు మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకుంటారు. మ‌నం వేయక పోతే పోయేది ఏముందిలే అనే ధోర‌ణి ఎక్కువ మంది లో ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్స్ లో హీరో నాగార్జున‌, అయ‌న స‌తీమ‌ణి అమ‌ల‌.. అలాగే అల్లు అర్జున్.. నంద‌మూరి బాల‌కృష్ణ లు ఇప్ప‌టికే ఓటు వేసి బాధ్య‌త చాటుకున్నారు. నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. మేము మా ఓటు హ‌క్కును ఉప‌యోగించుకున్నాం. మీరు మీ కుటుంబ స‌భ్యులు( ఓటు హ‌క్కు వున్న వాళ్లంద‌రు..) ఓటు వేయండ‌ని చెప్పారు. అయితే అఖిల్ ఓటు ఓటర్స్ లిస్ట్ లో లేదని నాగార్జున తెలియజేసారు. త‌మ అభిమాన హీరోలు అంత బాధ్య‌త యుతంగా వుంటే.. ఓటు ఏమి వేస్తాములే అని బ‌ద్ద‌కించే వాళ్లు కూడా పోలింగ్ స్టేష‌న్స్ కు స్టార్ట్ అవుతార‌న‌డంలో సందేహాం లేదు క‌దా.!

bala_2720636g CaL0WuyUsAAGiLQ.jpg-large-

allu-arjunntr

First Published:  2 Feb 2016 4:47 AM GMT
Next Story