Telugu Global
International

28ఏళ్ల త‌రువాత ఆ ప‌ట్ట‌ణంలో తొలిబిడ్డ జ‌న్మించింది!

ఇదొక విచిత్రం… 1987నుండి ఇటలీలోని ఒస్టానా అనే  ప‌ట్ట‌ణంలో అస‌లు ఒక్క‌బిడ్డ కూడా జ‌న్మించ‌లేదు. ఇప్పుడు, ఇంత‌కాలం త‌రువాత రెండువారాల క్రిత‌మే త‌మ ప‌ట్ట‌ణంలో ఒక బిడ్డ జ‌న్మించిన‌ట్టుగా ఆ ప‌ట్ట‌ణ మేయ‌ర్ తెలిపాడు. ఇంకా విచిత్ర‌మేమిటంటే ఆ ప‌ట్ట‌ణ జ‌నాభా, ఇప్పుడు పుట్టిన బిడ్డ‌తో క‌లిపి 85 మాత్ర‌మే. ఇట‌లీలోని  చాలా ప‌ట్ట‌ణాలు, గ్రామాలు ప్ర‌స్తుతం ఇలాంటి దుర‌వ‌స్థ‌లోనే ఉన్నాయి. ఒస్టానాలో అయితే 1976 నుండి 1987 వ‌ర‌కు కేవ‌లం 17మంది బిడ్డ‌లు మాత్ర‌మే జ‌న్మించారు. […]

28ఏళ్ల త‌రువాత ఆ ప‌ట్ట‌ణంలో తొలిబిడ్డ జ‌న్మించింది!
X

ఇదొక విచిత్రం… 1987నుండి ఇటలీలోని ఒస్టానా అనే ప‌ట్ట‌ణంలో అస‌లు ఒక్క‌బిడ్డ కూడా జ‌న్మించ‌లేదు. ఇప్పుడు, ఇంత‌కాలం త‌రువాత రెండువారాల క్రిత‌మే త‌మ ప‌ట్ట‌ణంలో ఒక బిడ్డ జ‌న్మించిన‌ట్టుగా ఆ ప‌ట్ట‌ణ మేయ‌ర్ తెలిపాడు. ఇంకా విచిత్ర‌మేమిటంటే ఆ ప‌ట్ట‌ణ జ‌నాభా, ఇప్పుడు పుట్టిన బిడ్డ‌తో క‌లిపి 85 మాత్ర‌మే. ఇట‌లీలోని చాలా ప‌ట్ట‌ణాలు, గ్రామాలు ప్ర‌స్తుతం ఇలాంటి దుర‌వ‌స్థ‌లోనే ఉన్నాయి. ఒస్టానాలో అయితే 1976 నుండి 1987 వ‌ర‌కు కేవ‌లం 17మంది బిడ్డ‌లు మాత్ర‌మే జ‌న్మించారు. 1987 త‌రువాత మ‌రో బిడ్డ జ‌న్మించ‌డం ఇప్పుడే. ఈ బిడ్డ పుట్టుక‌ను తాము ఒక వేడుక‌లా చేసుకోనున్నామ‌ని, ఈ బిడ్డ‌తో తిరిగి త‌మ ప‌ట్ట‌ణం పిల్లాపాప‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని ఆశిస్తున్నామ‌ని ఆ చిన్న‌ప‌ట్టణ మేయ‌ర్ లాంబార్డో తెలిపాడు, ఇట‌లీలో చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో ఉన్న యువ‌త ఉపాధి అవ‌కాశాలు లేక స‌మీపంలో ఉన్న న‌గ‌రాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిపోతున్నారు. దాంతో గ్రామాలు, ప‌ట్ట‌ణాలు ఖాళీ అయిపోతున్నాయి. ఒస్టానాలో అయితే కేవ‌లం ఒక షాపు, ఒక బార్, రెండు రెస్టారెంట్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని ఒక ఇటాలియ‌న్ న్యూస్ వెబ్‌సైట్ వెల్ల‌డించింది.

మ‌రొక ఇట‌లీ టౌన్‌లో అయితే ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా క్ర‌మంగా తప్ప‌కుండా ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌నే నిబంధ‌న విధించారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌ను కాపాడి, మ‌ర‌ణాల‌ను త‌గ్గించి, జ‌నాభా త‌గ్గ‌కుండా చూసుకోవాల‌నేది అక్క‌డి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. ప్ర‌భుత్వం మ‌ర‌ణాన్ని చ‌ట్ట‌వ్య‌తిరేక‌మైన చ‌ర్య‌గా మార్చేసింద‌నే జోకులు ఈ నిబంధన మీద విన‌బ‌డుతున్నాయి. గాంగీ అనే మ‌రొక ప‌ట్ట‌ణంలోని కౌన్సిల్ మ‌రొక ఉపాయం ఆలోచించింది. ఆ ఊళ్లో 20 ఇళ్ల‌ను రెండు డాల‌ర్ల‌కంటే త‌క్కువ ధ‌ర‌కే అమ్ముతున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. అయితే ఇంత చ‌వగ్గా ఇళ్ల‌ను అమ్ముతున్నామ‌న్నా వాటికోసం అప్ల‌యి చేసుకున్న‌వారు 50మంది మాత్ర‌మే. ఇప్పుడు ఆ ఊళ్లో 7000మంది జ‌నాభా ఉన్నారు. అయినా ఈ సంఖ్య రానురాను త‌గ్గిపోయి త‌మ ప‌ట్ట‌ణం కూడా ఒస్టానాలా మారిపోతుంద‌ని అక్క‌డి నాయకులు భ‌య‌ప‌డుతున్నారు.

First Published:  2 Feb 2016 1:53 AM GMT
Next Story