Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజీకి తొలి దెబ్బ

ఆదిలోనే హంసపాదులా జనతా గ్యారేజీకి మొట్టమొదటే పెద్ద దెబ్బ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి ఈనెల 16 నుంచి కాల్షీట్లు కేటాయించాడు ఎన్టీఆర్. అయితే అంతకంటే ముందు నుంచే అంటే ఇవాల్టి నుంచి జనతా గ్యారేజీ షూటింగ్ ను ప్రారంభించాలనుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. సినిమాకు సంబంధించి భారీ సెట్ నిర్మాణం కూడా జరిగిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టులతో సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాలని అనుకున్నాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా… జనతా గ్యారేజీ ఫస్ట్ షెడ్యూలే వాయిదాపడిపోయింది. కేవలం […]

జనతా గ్యారేజీకి తొలి దెబ్బ
X
ఆదిలోనే హంసపాదులా జనతా గ్యారేజీకి మొట్టమొదటే పెద్ద దెబ్బ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి ఈనెల 16 నుంచి కాల్షీట్లు కేటాయించాడు ఎన్టీఆర్. అయితే అంతకంటే ముందు నుంచే అంటే ఇవాల్టి నుంచి జనతా గ్యారేజీ షూటింగ్ ను ప్రారంభించాలనుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. సినిమాకు సంబంధించి భారీ సెట్ నిర్మాణం కూడా జరిగిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టులతో సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాలని అనుకున్నాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా… జనతా గ్యారేజీ ఫస్ట్ షెడ్యూలే వాయిదాపడిపోయింది. కేవలం మంచిరోజు కాదనే ఉద్దేశంతోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దర్శకుడు కొరటాల… తనకు బాగా కలిసొచ్చిన దేవిశ్రీప్రసాద్ నే మరోసారి ఈ సినిమాకు తీసుకున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా హిట్టవ్వడంతో… తారక్ కూడా దేవీనే కొనసాగించాలని ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ బాణీలు ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు తారక్ కు వినిపిస్తారు. మీరు చూస్తున్న ఫొటోలు ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ లోనివే.
devi 1 devi 2
First Published:  2 Feb 2016 1:00 AM GMT
Next Story