Telugu Global
NEWS

కాపు యువ‌త‌ని  నిరాశకి గురిచేసిన‌ ప‌వ‌న్‌!

కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం నేప‌థ్యంలో ప‌వ‌న్ పెట్టిన ప్రెస్‌మీట్ కాపు యువ‌త‌ను తీవ్ర‌మైన నిరాశ‌కే గురిచేసింది. ప‌వ‌న్ రాజ‌కీయ ఆరంగేట్రం నుండి ఆయ‌న‌మీద ఎంత‌గానో అశ‌లు పెట్టుకున్న అభిమానులు, ముఖ్యంగా ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం వారు….ప‌వ‌న్ త‌మ‌ని అత్యంత నిరాశ‌కు గురిచేశార‌ని వాపోతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్రెస్‌మీట్ పెట్టి.. హ‌డావుడిగా, ఫ్లాట్‌ఫాంమీద రెడీగా ఉన్న రైలుని ఎక్క‌డానికి ప‌రుగులు పెట్టే  ప్ర‌యాణికుడిలా నాలుగుమాట‌లు మాట్లాడేసి వెళ్లిపోవ‌డాన్ని తాము జీర్ణించుకోలేక‌పోతున్నామంటున్నారు.  ప‌వ‌న్ చెప్పిన‌దంతా  గంద‌ర‌గోళంగా ఉంద‌ని,  అందులో ఒక […]

కాపు యువ‌త‌ని  నిరాశకి గురిచేసిన‌ ప‌వ‌న్‌!
X

కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం నేప‌థ్యంలో ప‌వ‌న్ పెట్టిన ప్రెస్‌మీట్ కాపు యువ‌త‌ను తీవ్ర‌మైన నిరాశ‌కే గురిచేసింది. ప‌వ‌న్ రాజ‌కీయ ఆరంగేట్రం నుండి ఆయ‌న‌మీద ఎంత‌గానో అశ‌లు పెట్టుకున్న అభిమానులు, ముఖ్యంగా ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం వారు….ప‌వ‌న్ త‌మ‌ని అత్యంత నిరాశ‌కు గురిచేశార‌ని వాపోతున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి.. హ‌డావుడిగా, ఫ్లాట్‌ఫాంమీద రెడీగా ఉన్న రైలుని ఎక్క‌డానికి ప‌రుగులు పెట్టే ప్ర‌యాణికుడిలా నాలుగుమాట‌లు మాట్లాడేసి వెళ్లిపోవ‌డాన్ని తాము జీర్ణించుకోలేక‌పోతున్నామంటున్నారు. ప‌వ‌న్ చెప్పిన‌దంతా గంద‌ర‌గోళంగా ఉంద‌ని, అందులో ఒక క్ర‌మ‌త్వంగానీ, చెప్పాల‌నుకుంటున్న విష‌యంపై ఒక స్ప‌ష్ట‌త‌కానీ లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎవ‌రో వ‌స్తార‌ని ఏదో చేస్తార‌ని ఎదురు చూసి మోస‌పోకుమా…అనే సందేశాన్ని భ‌గ్గుమంటున్న కాపుల‌కు ఇచ్చి, ప‌వ‌న్ ఒక‌ర‌కంగా మేలు చేశార‌ని, ఇంకా త‌న‌పై ఆశ‌లు పెట్టుకున్న వారేవ‌రైనా ఉంటే వారి క‌ళ్లు తెరిపించార‌నే వ్యంగాస్త్రాలూ వినిపిస్తున్నాయి. అస‌లు ఆయ‌న అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిలా స్పందించ‌లేదని, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసిన ఒక నాయ‌కుడిగానూ స్పందించ‌లేదని, ఆయ‌న‌ని అనుస‌రిస్తే తాము మ‌రింత అయోమ‌యంలో ప‌డిపోతామ‌ని కాపు వ‌ర్గానికి చెందిన‌వారు భావిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ప‌వ‌న్‌ తాను దేశ స‌మ‌గ్ర‌త‌కోసం పోరాడ‌తాన‌ని త‌న ఎజెండా మ‌రోసారి ప్ర‌క‌టించగా, దీనిపై కూడా విమ‌ర్శ‌లు విన‌బ‌డుతున్నాయి. ప‌వ‌న్ దృష్టిలో అస‌లు దేశ‌భ‌క్తి అంటే ఏమిటో ఒక‌సారి చెబితే బాగుంటుంద‌ని, ఆయ‌న దేశ‌భ‌క్తిలో ఇంకా ఏఏ ప్ర‌జాస‌మ‌స్య‌లు ఉండ‌వో చెబితే, అమాయ‌కంగా ఆయ‌న‌కోసం ఎదురుచూసిన ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటారు క‌దా అనే వ్యంగాస్త్రాలూ ప‌వ‌న్ మీద ఎక్కుపెడుతున్నారు కొంద‌రు.

ప‌వ‌న్ దృష్టిలో ఉన్న‌ దేశ స‌మ‌స్య‌ల్లో కాపు రిజ‌ర్వేష‌న్ల స‌మ‌స్య లేక‌పోవ‌డం త‌మ దుర‌దృష్టమే త‌ప్ప‌, అది ప‌వన్ బాధ్య‌త కాదులే అనే విమ‌ర్శ‌లు, ఇదే స‌మ‌స్య మ‌రికాస్త ముదిరి జాతీయ రాజ‌కీయ వేదిక‌మీద‌కు వెళితే అప్పుడు ఆయ‌న స్పందిస్తారా అనే ప్ర‌శ్న‌లు విన‌బ‌డుతున్నాయి. ఇవ‌న్నీ కాకుండా ఏ అధికారంలో లేని తాను మ‌ధ్య వ‌ర్తిత్వం వ‌హిస్తే రాజ్యాంగాన్ని అవ‌మానించిన‌ట్టే అని ప‌వ‌న్ అన‌డం ప‌ట్ల కూడా కాపు యువ‌త చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్లు వేయ‌మ‌ని ఉప‌న్యాసాలు ఇచ్చి, ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసిన‌పుడు లేని ఆటంకం ఇప్ప‌డు వ‌చ్చిందా అని కూడా ప‌వ‌న్‌పై ఆగ్ర‌హాన్ని ప్ర‌క‌టిస్తున్నారు వారు.

Click on Image to Read:

tdp-women-leader

kotla- surya prakash reddy tdp

lokesh-greater-poll

chandrababu-tung-slip

Botsa-Satyanarayana-press-meet-1

jagan

First Published:  2 Feb 2016 2:24 AM GMT
Next Story