Telugu Global
Cinema & Entertainment

క‌రాటే క‌ళ్యాణి రికార్డ్..! 

ర‌వితేజ  న‌టించిన‌ మిర‌ప‌కాయ్ చిత్రంలో  అబ్బా… అంటూ మ‌త్తుగా   క‌వ్వించే ఆంటీ గుర్తుండే వుంటుంది.  వాస్త‌వంగా  ఆమె రియ‌ల్ లైఫ్ లో  మంచి  హ‌రిక‌థ క‌ళాకారిణి.   ఆదిప‌ట్ల క‌ళాపీఠం పేరుతో  ఇప్ప‌టికే  ఎన్నో వంద‌ల హ‌రిక‌థ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ఆమే అస‌లు పేరు  ప‌డాల క‌ళ్యాణి.గత ఏడాది జూన్‌ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించారు. […]

క‌రాటే క‌ళ్యాణి రికార్డ్..! 
X

ర‌వితేజ న‌టించిన‌ మిర‌ప‌కాయ్ చిత్రంలో అబ్బా… అంటూ మ‌త్తుగా క‌వ్వించే ఆంటీ గుర్తుండే వుంటుంది. వాస్త‌వంగా ఆమె రియ‌ల్ లైఫ్ లో మంచి హ‌రిక‌థ క‌ళాకారిణి. ఆదిప‌ట్ల క‌ళాపీఠం పేరుతో ఇప్ప‌టికే ఎన్నో వంద‌ల హ‌రిక‌థ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ఆమే అస‌లు పేరు ప‌డాల క‌ళ్యాణి.గత ఏడాది జూన్‌ 20 నుంచి 25 వరకు హైదరాబాద్‌లోని సిద్దార్ధనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకెన్ల పాటు హరికథలను వినిపించారు. దీంతో పాటు 61 మంది కళాకారులతో అష్టోత్తర శతనిర్విరామ హరికథా గాన యజ్ఞం నిర్వహించారు. హరికథా రంగంలోనే మొట్ట మొదటిసారిగా నిరంతర హరికథ యజ్ఞానికి శ్రీకారం చుట్టి కళ్యాణి విజయవంతమ య్యారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ విజయ ఘోష్‌ నుంచి లేఖ వచ్చినట్టు కళ్యాణి తెలిపారు.

First Published:  2 Feb 2016 6:44 AM GMT
Next Story