Telugu Global
NEWS

ఉత్త‌మ్ కాన్వాయ్‌పై దాడి

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జ‌రిగింది. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ఎంఐఎం శ్రేణులు ఈ దాడికి పాల్ప‌డ్డాయి. మీర్‌చౌక్ వ‌ద్ద ఈ దాడి జ‌రిగింది. దాడిలో ఉత్త‌మ్ కారు అద్దాలు ధ్వంసమ‌య్యాయి. ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స‌మక్షంలోనే ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. అడ్డువ‌చ్చిన కాంగ్రెస్ శాస‌న‌మండ‌లి పక్ష‌నేత ష‌బ్బీర్ అలీని ఓవైసీ ప‌క్క‌కు తోసేశారు. దీంతో ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో ఉత్త‌మ్ పై దాడి […]

ఉత్త‌మ్ కాన్వాయ్‌పై దాడి
X

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జ‌రిగింది. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ఎంఐఎం శ్రేణులు ఈ దాడికి పాల్ప‌డ్డాయి. మీర్‌చౌక్ వ‌ద్ద ఈ దాడి జ‌రిగింది. దాడిలో ఉత్త‌మ్ కారు అద్దాలు ధ్వంసమ‌య్యాయి. ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స‌మక్షంలోనే ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. అడ్డువ‌చ్చిన కాంగ్రెస్ శాస‌న‌మండ‌లి పక్ష‌నేత ష‌బ్బీర్ అలీని ఓవైసీ ప‌క్క‌కు తోసేశారు. దీంతో ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

కాంగ్రెస్ అభ్య‌ర్థిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో ఉత్త‌మ్ పై దాడి జ‌రిగింది. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఎంఐఎం కార్య‌క‌ర్త‌ల‌ను చెద‌ర‌గొట్టారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను పాత‌బ‌స్తీకి ర‌ప్పించారు. పాత‌బ‌స్తీలో ఎంఐఎం నేత‌లు రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అస‌దుద్దీన్ ఈ త‌ర‌హాలో ప్ర‌వ‌ర్తించ‌డం ఇది తొలిసారి కాదు. గ‌తంలోనూ ఒక‌సారి ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రూ చూస్తుండ‌గానే ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన కార్య‌కర్త‌ల‌ను క‌ర్ర‌తో చిత‌క‌బాదాడు.

ఉత్తమ్ పై దాడిని సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. ఎంపీ అసద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూతుల వద్ద 200 బైక్ లతో ఓవైసీ ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

First Published:  2 Feb 2016 12:20 AM GMT
Next Story