Telugu Global
Cinema & Entertainment

మేజిక్ ఫిగర్ కు మరో వీకెండ్ దూరంలో.....

నాన్నకు ప్రేమతో సినిమా హిట్టవుతుందనే విషయాన్ని సినిమా యూనిట్ ముందే ఊహించి ఉండొచ్చు. కానీ ఓవర్సీస్ లో కూడా ఊహించని విజయం సాధిస్తుందనే విషయాన్ని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. అవును… దాదాపు బాహుబలికి దగ్గరగా నాన్నకు ప్రేమతో సినిమా దూసుకుపోతోంది. ఇన్నాళ్లూ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడమే గొప్పగా భావించిన ఎన్టీఆర్… ఇప్పుడు నాన్నకు ప్రేమతో విజయంతో ఏకంగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఓవర్సీస్ […]

మేజిక్ ఫిగర్ కు మరో వీకెండ్ దూరంలో.....
X
నాన్నకు ప్రేమతో సినిమా హిట్టవుతుందనే విషయాన్ని సినిమా యూనిట్ ముందే ఊహించి ఉండొచ్చు. కానీ ఓవర్సీస్ లో కూడా ఊహించని విజయం సాధిస్తుందనే విషయాన్ని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. అవును… దాదాపు బాహుబలికి దగ్గరగా నాన్నకు ప్రేమతో సినిమా దూసుకుపోతోంది. ఇన్నాళ్లూ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడమే గొప్పగా భావించిన ఎన్టీఆర్… ఇప్పుడు నాన్నకు ప్రేమతో విజయంతో ఏకంగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఓవర్సీస్ లో ఇప్పటివరకు ఈ సినిమా…. 19 లక్షల 92 వేల 577 డాలర్లు వసూలు చేసింది. 20 లక్షల డాలర్ల క్లబ్ లోకి చేరాలంటే జస్ట్ మరో 7423 డాలర్లు సంపాదిస్తే సరిపోతుంది. ఈమాత్రం వసూళ్లు రావడం పెద్ద కష్టమేం కాదు. మరీ ముఖ్యంగా మరో భారీ సినిమా ఏదీ బరిలో లేకపోవడంతో…. ఈ డ్రీమ్ ఫిగర్ ను అందుకోవడం పెద్ద కష్టమేం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. సో… నాన్నకు ప్రేమతో సినిమాతో మరో రికార్డు దిశగా తారక్ దూసుకుపోతున్నాడన్నమాట.
First Published:  2 Feb 2016 1:13 AM GMT
Next Story