శర వేగంగా తమిళ్ పటాస్..!
గత యేడాది రిలీజైన పటాస్ చిత్రం కెరీర్ పరంగా నందమూరి కళ్యాణ్ రామ్ కు ఆక్సిజన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి అనే కొత్త దర్శకుడు చేసిన ఈ చిత్రం సిస్టర్ , మదర్ సెంటిమెంట్ బలంగా ఉండటంతో సినిమా ఘన విజయం సాధించింది. సాధారణంగా ఒక లాగ్వేంజ్ లో హిట్ కొడితే.. వెంటనే రీమేక్ చేసే పరభాష నటులకు కొదువలేదు. ఎక్కడైన హిట్ అయితే చాలు అక్కడ వాలి పోతుంటారు ఈ హీరోలు. అటు […]
BY admin2 Feb 2016 6:23 AM GMT
X
admin Updated On: 2 Feb 2016 6:33 AM GMT
గత యేడాది రిలీజైన పటాస్ చిత్రం కెరీర్ పరంగా నందమూరి కళ్యాణ్ రామ్ కు ఆక్సిజన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి అనే కొత్త దర్శకుడు చేసిన ఈ చిత్రం సిస్టర్ , మదర్ సెంటిమెంట్ బలంగా ఉండటంతో సినిమా ఘన విజయం సాధించింది. సాధారణంగా ఒక లాగ్వేంజ్ లో హిట్ కొడితే.. వెంటనే రీమేక్ చేసే పరభాష నటులకు కొదువలేదు. ఎక్కడైన హిట్ అయితే చాలు అక్కడ వాలి పోతుంటారు ఈ హీరోలు. అటు కోలీవుడ్..ఇటు తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన లారెన్స్ ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. అల్రేడి మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యినట్లు టాక్. పటాస్ సినిమా కథను తమిళ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు..చేర్పులు చేస్తున్నారు. సాయిరమని అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి అటు కోలీవుడ్..ఇటు టాలీవుడ్ లోనూ అభిమానులు వున్న లారెన్స్ .. రీమేక్ చేసిన పటాస్ ను కేవలం కోలీవుడ్ కే పరిమితం చేస్తాడా..? లేక టాలీవుడ్ లో కూడా డబ్బింగ్ చేసి వదులుతాడా అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
Next Story