Telugu Global
Others

ప్రాణమే ఉంటే... పులివెందుల ఆత్మహత్య చేసుకునేది!

భూగోళం ఒక్కటే. మనిషే అధిపత్యం కోసం, హద్దుల కోసం దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలుగా గీతలు గీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. తమ ప్రాంతం, తమ ఊరిపై కన్నతల్లిపై కన్నా ఎక్కువగా ప్రేమను పెంచుకున్నాడు. ఒకడు వ్యక్తిగతంగా దూషించినా ఓర్చుకోవచ్చునేమో గానీ… కన్న ఊరిని తిడితే భరించడం ఏ వ్యక్తికైనా కష్టమే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పతనావస్థకు చేరిన రాజకీయల వల్ల ఎన్నో ప్రాంతాలు కన్నీరు పెడుతున్నాయి. అలాంటి ప్రాంతాల జాబితా తీస్తే పులివెందుల అన్నింటికంటే ముందు ఉంటుంది. […]

ప్రాణమే ఉంటే... పులివెందుల ఆత్మహత్య చేసుకునేది!
X

భూగోళం ఒక్కటే. మనిషే అధిపత్యం కోసం, హద్దుల కోసం దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలుగా గీతలు గీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. తమ ప్రాంతం, తమ ఊరిపై కన్నతల్లిపై కన్నా ఎక్కువగా ప్రేమను పెంచుకున్నాడు. ఒకడు వ్యక్తిగతంగా దూషించినా ఓర్చుకోవచ్చునేమో గానీ… కన్న ఊరిని తిడితే భరించడం ఏ వ్యక్తికైనా కష్టమే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పతనావస్థకు చేరిన రాజకీయల వల్ల ఎన్నో ప్రాంతాలు కన్నీరు పెడుతున్నాయి. అలాంటి ప్రాంతాల జాబితా తీస్తే పులివెందుల అన్నింటికంటే ముందు ఉంటుంది.

పేరుకు పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్‌ పులివెందుల అని ప్రచారం చేస్తారు. కానీ అది నిజమేనా అంటే నమ్మడం కష్టం. రాష్ట్రంలో ఎన్నో ఊర్లు ఉన్నా ఏ ఊరిని కూడా నేరుగా పేరుతో దూషించే ధైర్యం ఏ రాజకీయ నాయకుడు చేయరు. కానీ పులివెందుల అంటే మాత్రం నేరుగా ఊరిపేరు పెట్టే తిడుతున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే పదేపదే పులివెందుల పేరుతో తన ప్రత్యర్థులను తిట్టడం బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అసహనం ఆకాశాన్ని తాకిందనిపిస్తోంది.

పులివెందులంటే జగన్ ఒక్కడే కాదు.. అక్కడా ప్రజలు ఉంటారు. వారూ మనుషులే. వారికి తమ ఊరి మీద ప్రేమ ఉంటుందన్న కనీస జ్ఞానం మన నేతలకు లేకపోవడం అనాగరికమే. పులివెందులలో మీసాలు మొలిచిన టీడీపీ నేతలు కూడా ఉంటారు. కానీ చంద్రబాబు నుంచి గల్లీ లీడర్‌ వరకు ప్రతివారు పులివెందుల్లో ఉన్న వారంతా రౌడీలు, దుర్మార్గులు అన్నట్టు తిడుతుంటే ఒక్కరూ స్పందించరు. కనీసం రహస్యంగా వెళ్లి జగన్‌ను తిడితే తిట్టారు గానీ మా పులివెందులను తిట్టకండి అని మాత్రం టీడీపీ నేతలు సీఎంను అడగరు.

కొందరు నేతలు ఇక్కడ పుట్టడమే పులివెందుల చేసుకున్న నేరమా. ఒక్కటి మాత్రం నిజం. పులివెందుల అనే ఊరు ప్రాణం లేక బతికిపోయింది. ప్రాణమే ఉంటే పదేపదే రాష్ట్రంలోనే దుర్మార్గమైనదిగా తనను దూషించడాన్ని భరించలేక ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. లేకుంటే పక్కవాళ్లు తనను దూషిస్తున్నా పట్టించుకోని సొంత బిడ్డల చీమునెత్తురు లేని తనాన్ని చూసి అలిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేది. పాపం పులివెందుల.

-రామ్‌నాథ్‌, నార్పల

Click on Image to Read:

pawan

andhra-pradesh-intelligence-department

kodela1

pawan-suside

ఈ మాత్రానికి కేరళ నుంచి రావాలా…తమ్ముడూ!

ఆయన సలహా విని ఉంటే ఇలా జరిగేది కాదేమో?

భలే వాడేశావ్ బాస్‌..!

కాపుల్లో ఇంత మార్పా?

హంతకుడిని స్పీకర్‌ చేశావ్… క్రిమినల్ నువ్వా నేనా?

ధ్వజమెత్తిన చిరు.. విజయశాంతి మద్దతు

రౌడీలకు ట్రైనింగ్ ఇచ్చి పంపారు. వాటికి నిధులెక్కడివి?

కాసేపు కంగారు పడ్డ టీవీ చానళ్లు

ఇప్పుడేమంటారు?

First Published:  1 Feb 2016 11:53 PM GMT
Next Story