Telugu Global
Cinema & Entertainment

భ‌ర్త డైర‌క్ష‌న్‌...భార్య యాక్ష‌న్‌!

రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాక విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న న‌టి ర‌మ్య‌కృష్ణ‌. బాహుబ‌లి విజ‌యంలో ఆమెకూ మంచి వాటానే ద‌క్కింది. క‌థ‌కు అవ‌కాశంలేని బాహుబ‌లి సినిమాలో బాగా ఎలివేట్ అయిన కొన్ని పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ ధ‌రించిన శివ‌గామి పాత్ర ఒక‌టి. హీరోయిన్‌గా న‌టించిన‌పుడు ఎంతో గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తూ,  ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు క్యార‌క్టర్ న‌టిగానూ అంతే స్థాయిలో ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు  పేరు తెచ్చుకోవ‌డం విశేషం. అందుకే న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు రమ్య కృష్ణ‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. బాహుబ‌లి […]

భ‌ర్త డైర‌క్ష‌న్‌...భార్య యాక్ష‌న్‌!
X

రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాక విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న న‌టి ర‌మ్య‌కృష్ణ‌. బాహుబ‌లి విజ‌యంలో ఆమెకూ మంచి వాటానే ద‌క్కింది. క‌థ‌కు అవ‌కాశంలేని బాహుబ‌లి సినిమాలో బాగా ఎలివేట్ అయిన కొన్ని పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ ధ‌రించిన శివ‌గామి పాత్ర ఒక‌టి. హీరోయిన్‌గా న‌టించిన‌పుడు ఎంతో గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తూ, ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు క్యార‌క్టర్ న‌టిగానూ అంతే స్థాయిలో ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు పేరు తెచ్చుకోవ‌డం విశేషం. అందుకే న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు రమ్య కృష్ణ‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. బాహుబ‌లి తరువాత సోగ్గాడే చిన్న‌నాయ‌నలో సైతం ర‌మ్య‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే పెళ్ల‌యిన త‌రువాత ర‌మ్య కృష్ణ‌ త‌న‌ భ‌ర్త కృష్ణ‌వంశీ సినిమాలో న‌టించ‌లేదు. పెళ్లికి ముందు చంద్ర‌లేఖ‌లో న‌టించింది. ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ట్టే ఉంది. కృష్ణ‌వంశీ భారీఎత్తున గ్రాఫిక్స్‌తో తీస్తున్న రుద్రాక్ష‌లో ర‌మ్య కృష్ణ ఒక ముఖ్య‌మైన పాత్ర‌ని ధ‌రించ‌నుంది. ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో భ‌క్తిర‌సం, భ‌యాన‌కం మిళితం చేసిన క‌థ రుద్రాక్ష‌. స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జ‌ట్‌తో రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం.

First Published:  2 Feb 2016 1:13 AM GMT
Next Story