Telugu Global
Cinema & Entertainment

ప్రభుదేవాను భయపెడుతున్న తమన్నా 

హారర్ అనేది ఇప్పుడు కాసులు రాల్చే బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయింది. ఈ హారర్ కు కాసింత కామెడీని మిక్స్ చేస్తే సినిమా మినిమం గ్యారెంటీ. ఇదే ఫార్ములాకు హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ జతచేస్తే సినిమా కచ్చితంగా హిట్. ప్రస్తుతం సౌత్ లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. తాజాగా వచ్చిన కళావతి సినిమా కూడా ఈ విషయాన్ని మరోసారి రుజువుచేసింది. దీంతో ఈ ఫార్ములాలోకి ఇప్పుడు ప్రభుదేవా కూడా షిఫ్ట్ అయ్యాడు. ఇన్నాళ్లూ హిందీ సినిమాల్ని సౌత్ లోకి…. […]

ప్రభుదేవాను భయపెడుతున్న తమన్నా 
X
హారర్ అనేది ఇప్పుడు కాసులు రాల్చే బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయింది. ఈ హారర్ కు కాసింత కామెడీని మిక్స్ చేస్తే సినిమా మినిమం గ్యారెంటీ. ఇదే ఫార్ములాకు హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ జతచేస్తే సినిమా కచ్చితంగా హిట్. ప్రస్తుతం సౌత్ లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. తాజాగా వచ్చిన కళావతి సినిమా కూడా ఈ విషయాన్ని మరోసారి రుజువుచేసింది. దీంతో ఈ ఫార్ములాలోకి ఇప్పుడు ప్రభుదేవా కూడా షిఫ్ట్ అయ్యాడు. ఇన్నాళ్లూ హిందీ సినిమాల్ని సౌత్ లోకి…. సౌత్ సినిమాల్ని హిందీలోకి తీసే ఈ దర్శకుడు… ఇప్పుడు హారర్ కామెడీపై ఫోకస్ పెట్టాడు. దీనికి సంబంధించి ఇప్పటికే మిల్కీబ్యూటీ తమన్నాతో కూడా చర్చలు జరిపాడట. త్వరలోనే తమన్న ప్రధాన పాత్రలో ఓ హారర్ సినిమాను తెరకెక్కించాలని ప్రభుదేవా భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు తమన్నానే తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. కుదిరితే తాను తీయబోయే సినిమాను సౌత్ తో పాటు నార్త్ లో కూడా విడుదల చేయాలనుకుంటున్నాడు ప్రభుదేవా. కాబట్టి తమన్న అయితేనే కరెక్ట్ అనేది అతడి ఫీలింగ్. ఆయితే భారీ రెమ్యునరేషన్ అడిగి ప్రభుదేవాని తమ్మనా దిమ్మతిరిగేలా చేసిందని ఫిలిం నగర్ టాక్.
First Published:  2 Feb 2016 1:09 AM GMT
Next Story