Telugu Global
National

టాటా కారుకి ఎస‌రు పెట్టిన‌ జికా వైర‌స్‌!

టాటా కంపెనీ ఈ మ‌ధ్య‌కాలంలో ఒక బుల్లి కారుని రూపొందించింది.  దాని పేరు జికా హ్యాచ్‌బ్యాక్‌. ఈ జిప్పీ కారుని ప్ర‌మోట్ చేయ‌డానికి టాటా కంపెనీ విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది.  బార్సిలోనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ  దీనికి ప్ర‌చార క‌ర్త‌గా ఉన్నారు. అయితే జికా అనే కారు పేరుతో కంపెనీకి ఒక చిక్కొచ్చి ప‌డింది. అదే పేరుతో ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణిస్తున్న జికా వైర‌స్, కారు కంటే వేగంగా మ‌రింత పాపుల‌ర్ అయిపోయింది.  వ్యాధిపై అవ‌గాహ‌న […]

టాటా కారుకి ఎస‌రు పెట్టిన‌ జికా వైర‌స్‌!
X

టాటా కంపెనీ ఈ మ‌ధ్య‌కాలంలో ఒక బుల్లి కారుని రూపొందించింది. దాని పేరు జికా హ్యాచ్‌బ్యాక్‌. ఈ జిప్పీ కారుని ప్ర‌మోట్ చేయ‌డానికి టాటా కంపెనీ విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. బార్సిలోనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ దీనికి ప్ర‌చార క‌ర్త‌గా ఉన్నారు. అయితే జికా అనే కారు పేరుతో కంపెనీకి ఒక చిక్కొచ్చి ప‌డింది. అదే పేరుతో ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణిస్తున్న జికా వైర‌స్, కారు కంటే వేగంగా మ‌రింత పాపుల‌ర్ అయిపోయింది. వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించే ఉద్దేశ్యంతో ప్ర‌పంచ‌మీడియా జికా వైర‌స్‌కి ఎక్కువ‌గా ప్ర‌చారం క‌ల్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో టాటా కంపెనీ త‌మ కారు పేరుని మార్చాల‌నే ఉద్దేశంతో ఉంది.

జికా వైర‌స్‌ గ‌ర్భంలోని పిల్ల‌ల‌కు హాని చేసి, వారికి మెద‌డుకి సంబంధించిన వ్యాధిని క‌లిగిస్తోంది. వివిధ దేశాల‌లో ఈ వైర‌స్ వ్యాపిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కారు పేరు విష‌యంలో తాము పున‌రాలోచించుకుంటున్నామ‌ని కంపెనీ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. న్యూఢిల్లీలో ఈ వారం జ‌ర‌గ‌నున్న ఆటో ఎక్స్‌పో 2016లో దీన్ని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది.

First Published:  2 Feb 2016 2:04 AM GMT
Next Story