‘కాపు’ కాయని పవన్ – ఎత్తుగడ ఇదే!

మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట చంద్ర‌బాబు ప‌డ్డారంటే కార‌ణం ఆయ‌న కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావడమే. ప‌వ‌న్ చెబితే కాపు సామాజిక‌వ‌ర్గం ముఖ్యంగా ఆ వ‌ర్గానికి చెందిన యువ‌త టీడీపీకే ఓటేస్తార‌న్న న‌మ్మ‌కం. చంద్ర‌బాబు ఆలోచ‌న వంద‌శాతం స‌రైన‌దే. ఎన్నిక‌లప్పుడు కాపుల్లో చిరు క‌న్నా ప‌వ‌న్‌కే క్రేజ్ ఎక్కువ‌గా క‌నిపించింది. అనుకున్న‌ట్టుగానే ప‌వ‌న్ టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిచండంతో కాపులు సామూహికంగా టీడీపీకి ఓటేశారు. కానీ ఇప్పుడు ఆ కాపులు రిజ‌ర్వేష‌న్ల కోసం రోడ్డెక్కారు. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై అన్ని పార్టీలు కూడా త‌మ అభిప్రాయాన్ని స్పష్టం చేశాయి. కానీ కాపులు దేవుడిలా చూసిన ప‌వ‌న్ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు.

సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన ప‌వ‌న్ కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై మీ అభిప్రాయం ఏమిటని విలేక‌ర్లు సూటిగా ప్ర‌శ్నిస్తే తాను ఒక కులం కోసం పోరాటం చేసే వ్య‌క్తిని కాదంటూ కాపులకు హ్యాండిచ్చారు. ప‌వ‌న్ స‌మాధానం కాపుల క‌డుపు మండేలా చేసింది. అయితే పవన్ ఇలా మాట్లాడడం వెనుక ఆయ‌న సొంత ఎజెండా ఉంద‌నిపిస్తోంది. ఎందుకంటే..

2009లో చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు ప్రజారాజ్యం పార్టీని త‌మ సొంత పార్టీగా భావించారు. అది మోతాదు మించి చివ‌ర‌కు కాపుల పార్టీగా ముద్ర‌ప‌డింది. దీంతో ప్ర‌జారాజ్యం ప‌రాజ‌యం పాలైంది. ఇత‌ర కులాలు ఓన్ చేసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇది జ‌రిగింద‌ని ప‌వ‌న్ భావ‌న‌. కాబ‌ట్టి ఇప్పుడు కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే ఇత‌ర కులాలు జ‌న‌సేన‌కు ఎక్క‌డ దూర‌మ‌వుతాయోన‌న్న భావ‌న‌తో ఓ స‌గ‌టు రాజ‌కీయ‌నాయ‌కుడిలాగే ప‌వ‌న్ కూడా త‌ప్పించుకున్నారు.

త‌న‌ది న్యూలుక్ రాజ‌కీయం అంటూనే ఏ ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా చివరకు కాపు ఉద్య‌మ‌కారుల‌ను త‌ప్పుపడుతూ ప‌వ‌న్ మాట్లాడడం ఆశ్చ‌ర్య‌కంగానే అనిపించింది. అయితే ప‌వ‌న్ ఒక లాజిక్ మిస్ అవుతున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తే ఇత‌ర కులాలు దూర‌మ‌వుతాయ‌ని ఆయ‌న భావించ‌వ‌చ్చు… కానీ ప‌వ‌న్‌కు కాపులు దూర‌మ‌య్యార‌ని అర్థ‌మైన వేళ చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు.

ఎవ‌రేమ‌న్నా ప‌వ‌న్‌కు బ‌లం కాపులే. వారినే దూరం చేసుకుంటే చ‌రిత్ర కూడా పున‌రావృతం కాదు. కాపులు బ‌లంగా ఉన్న ప్రాంతంలో చిరంజీవికి 18 సీట్లైనా వ‌చ్చాయి… ప‌వ‌న్‌కు అవి కూడా రావ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తం మీద‌ కాపు గ‌ర్జ‌న స‌భ ప‌వ‌న్‌ను కాపుల నుంచి అంతోఇంతో దూరం చేసిన‌ట్టే అనిపిస్తోంది.

Click on Image to Read:

pulivendula2

pawan

andhra-pradesh-intelligence-department

kodela1

pawan-suside

ఈ మాత్రానికి కేరళ నుంచి రావాలా…తమ్ముడూ!

ఆయన సలహా విని ఉంటే ఇలా జరిగేది కాదేమో?

భలే వాడేశావ్ బాస్‌..!

కాపుల్లో ఇంత మార్పా?

హంతకుడిని స్పీకర్‌ చేశావ్… క్రిమినల్ నువ్వా నేనా?

ధ్వజమెత్తిన చిరు.. విజయశాంతి మద్దతు

రౌడీలకు ట్రైనింగ్ ఇచ్చి పంపారు. వాటికి నిధులెక్కడివి?

కాసేపు కంగారు పడ్డ టీవీ చానళ్లు

ఇప్పుడేమంటారు?