Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య` గాడ్ ఫాద‌ర్` కే మొగ్గు చూపుతాడా?

ప్ర‌స్తుతం బాల‌య్యం అభిమానుల‌కు త‌మ అభిమాన న‌టుడి 100వ చిత్రం మీదనే దృష్టి ఉంది. సంక్రాంతి పండ‌క్కి పోటీగా వచ్చిన సినిమాల్లో డిక్టేర్ బొక్క బోర్లపడటంతో 100వ సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం . వందో సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగితం శ్రీ‌నివాస‌రావును “ఆదిత్య 369” సీక్వెల్ కు ఒప్పించార‌నే టాక్ వినిపించింది. బాల‌య్య కూడా లైన్ బాగా చెప్పారు బావుంది ని డిక్టేర్ స‌మ‌యంలో సింగీతం కు చేప్పారని అయితే అప్పట్లోనే 101 […]

బాల‌య్య` గాడ్ ఫాద‌ర్` కే మొగ్గు చూపుతాడా?
X

ప్ర‌స్తుతం బాల‌య్యం అభిమానుల‌కు త‌మ అభిమాన న‌టుడి 100వ చిత్రం మీదనే దృష్టి ఉంది. సంక్రాంతి పండ‌క్కి పోటీగా వచ్చిన సినిమాల్లో డిక్టేర్ బొక్క బోర్లపడటంతో 100వ సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం . వందో సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగితం శ్రీ‌నివాస‌రావును “ఆదిత్య 369” సీక్వెల్ కు ఒప్పించార‌నే టాక్ వినిపించింది. బాల‌య్య కూడా లైన్ బాగా చెప్పారు బావుంది ని డిక్టేర్ స‌మ‌యంలో సింగీతం కు చేప్పారని అయితే అప్పట్లోనే 101 వ చిత్రంగా చేద్దామని బాలయ్య చెప్పారని అంటున్నారు.. ఇక తాజాగా ప‌టాస్ ఫేమ్ అనిల్ రావిపూడి కూడా రామారావు గారు పేరు తో ఒక క‌థ‌ను చెప్పి ఒప్పించిన‌ట్లు మ‌రో రూమ‌ర్ న‌డుస్తుంది.
అయితే అభిమానుల మాత్రం బాల‌య్య వందో సినిమాను దర్శ‌కుడు బోయ‌పాటి తోనే చేయాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని టాక్. బాల‌య్య కోసం గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ ను కూడా బోయ‌పాటి సిద్దం చేసిన‌ట్లు తెలుస్తుంది. ఆల‌స్యం అయినా బాల‌య్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం సింహా, లెజెండ్ వంటి చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ఇచ్చిన బోయ‌పాటి అయితేనే స‌రిగ్గా చూపించ‌గ‌ల‌డ‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్లు టాక్. మ‌రి చివ‌ర‌కు బాల‌య్య ఫ్యాన్స్ ఒత్తిడికి బెండ్ అవుతాడో లేక‌.. త‌ను మ‌నుసుకు న‌చ్చిన ఆదిత్య 369 సీక్వెల్ కు ఓటేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  3 Feb 2016 5:16 AM GMT
Next Story