Telugu Global
WOMEN

పెద్ద కూతురూ… ఇంటి య‌జ‌మాని కావ‌చ్చు!

ఆడ‌పిల్లలు ఎంత చ‌దువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా చ‌ట్ట‌ప్ర‌కారం పుట్టింటికి య‌జ‌మాని అనిపించుకునే హోదా వారికి ఉండ‌దు. ఆడ‌పిల్ల‌ల‌కంటే చిన్న‌వాడైనా స‌రే మ‌గ‌పిల్ల‌వాడు ఉంటే అత‌నికే ఇంటి వ్య‌వ‌హారాల‌ను చూసే అధికారం, బాధ్య‌త‌ను క‌ట్ట‌బెడుతుంది  హిందూ కుటుంబ వ్య‌వ‌స్థ. ఇదే విష‌యంమీద కోర్టుకి వెళ్లింది ఢిల్లీకి చెందిన ఒక కుటుంబంలోని అమ్మాయి, త‌న తండ్రి పిన‌తండ్రులు మ‌ర‌ణించాక ఉమ్మ‌డి కుటుంబంలో తానే  పెద్ద‌ది క‌నుక కుటుంబ‌ నిర్వ‌హ‌ణ క‌ర్త తానే అవుతుంద‌ని ఆమె కోర్టులో కేసు వేసింది. త‌న‌కంటే […]

పెద్ద కూతురూ… ఇంటి య‌జ‌మాని కావ‌చ్చు!
X

ఆడ‌పిల్లలు ఎంత చ‌దువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా చ‌ట్ట‌ప్ర‌కారం పుట్టింటికి య‌జ‌మాని అనిపించుకునే హోదా వారికి ఉండ‌దు. ఆడ‌పిల్ల‌ల‌కంటే చిన్న‌వాడైనా స‌రే మ‌గ‌పిల్ల‌వాడు ఉంటే అత‌నికే ఇంటి వ్య‌వ‌హారాల‌ను చూసే అధికారం, బాధ్య‌త‌ను క‌ట్ట‌బెడుతుంది హిందూ కుటుంబ వ్య‌వ‌స్థ. ఇదే విష‌యంమీద కోర్టుకి వెళ్లింది ఢిల్లీకి చెందిన ఒక కుటుంబంలోని అమ్మాయి, త‌న తండ్రి పిన‌తండ్రులు మ‌ర‌ణించాక ఉమ్మ‌డి కుటుంబంలో తానే పెద్ద‌ది క‌నుక కుటుంబ‌ నిర్వ‌హ‌ణ క‌ర్త తానే అవుతుంద‌ని ఆమె కోర్టులో కేసు వేసింది. త‌న‌కంటే చిన్న‌వాడైన క‌జిన్, మ‌గ‌వాడిని క‌నుక చిన్న‌వాడినైనా నాకే ఇంటి ఆస్తుల నిర్వ‌హ‌ణ క‌ర్త‌గా, య‌జ‌మానిగా హ‌క్కులున్నాయ‌న‌డంతో ఆమె ఈ కేసు వేయాల్సి వ‌చ్చింది. కేసుని విచారించిన ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మ‌క తీర్పుని ఇచ్చింది. కుటుంబ బాధ్య‌త‌లు, దాని ఆస్తుల నిర్వ‌హ‌ణ, ఇంటికి పెద్ద‌దై ఉన్న‌పుడు ఆడ‌పిల్ల‌కూడా చేప‌ట్ట‌వ‌చ్చున‌ని పేర్కొంది. ఇక్క‌డ ఆస్తుల నిర్వ‌హ‌ణ అనేది ప్ర‌ధాన‌మైన విష‌యంగా ఈ కేసు న‌డిచింది.

హిందూ ఉమ్మ‌డి కుటుంబంలో ఇంటికి పెద్ద‌కొడుగ్గా పుట్టిన‌వాడికి ఎలాంటి అధికారాల‌యితే ఉంటాయో, పెద్ద కూతురిగా పుట్టిన మ‌హిళ‌కు సైతం అలాంటి అధికారా‌లే ఉంటాయ‌ని, అందులో వివ‌క్ష చూపాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌స్టిస్ న‌జ్మీ వాజిరి త‌న తీ ర్పులో స్ప‌ష్టంగా చెప్పారు. అయితే ఇక్క‌డ స‌ద‌రు కుటుంబానికి పెద్ద కూతురైన మ‌హిళ‌ను వ్య‌తిరేకిస్తూ కేసు వేసిన‌వారు, హిందూ వార‌స‌త్వ చ‌ట్టంలోని సెక్ష‌న్ 6ని ఉద‌హ‌రించారు. అందులో ఆస్తిని వార‌స‌త్వంగా పొందే హ‌క్కు ఆడ‌పిల్ల‌ల‌కు ఉన్నా దాని నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టే హ‌క్కు ఉండ‌ద‌ని వాదించారు. దీనికి స‌మాధానం చెబుతూ వాజిరి, కుటుంబ ఆస్తుల‌ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ని తీసుకునే అర్హ‌త ఆడ‌పిల్ల‌ల‌కు ఉండ‌దు అనే అంశాన్ని, 2005లో హిందూ వార‌స‌త్వ చ‌ట్టం నుండి తొల‌గించి స‌వ‌ర‌ణ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇక మ‌హిళ‌ ఆ బాధ్య‌త‌ని చేప‌ట్ట‌కుండా ఆపేందుకు ఎలాంటి ఆటంకాలు లేవ‌ని వాజిరి త‌న తీర్పులో వెల్ల‌డించారు..

First Published:  3 Feb 2016 12:35 PM GMT
Next Story