Telugu Global
Cinema & Entertainment

ప్రియాంక కు అలా మొద‌లైంది..!

సినిమా అవార్డ్స్ కు సంబంధించినంత వ‌ర‌కు .. అస్కార్ అవార్డ్ అత్యున్న‌త‌మైన‌ద‌నే చెప్పాలి. అయితే ఈ అవార్డుల వేడుక‌లో ఇండియ‌న్ సినిమా క‌ళా కారుల‌కు ప్రాతినిధ్యం చాలా కష్టమైన విషయం. అయితే ఈ యేడాది జ‌ర‌గ‌బోయో అస్కార్ వేడుక‌ల్లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అవ‌కాశం ద‌క్కింది. అమెరికా టెలివిజ‌న్ కార్య‌క్ర‌మం క్వాంటి కో తో ఇప్ప‌టికే ప్రియాంక చోప్రాకు అక్క‌డ బాగా గుర్తింపు వ‌చ్చింది. ఆ అవార్డుల వేడుక‌లో పాల్గొనే వారి జాబితాను ఆస్కార్ కమిటి […]

ప్రియాంక కు అలా మొద‌లైంది..!
X

సినిమా అవార్డ్స్ కు సంబంధించినంత వ‌ర‌కు .. అస్కార్ అవార్డ్ అత్యున్న‌త‌మైన‌ద‌నే చెప్పాలి. అయితే ఈ అవార్డుల వేడుక‌లో ఇండియ‌న్ సినిమా క‌ళా కారుల‌కు ప్రాతినిధ్యం చాలా కష్టమైన విషయం. అయితే ఈ యేడాది జ‌ర‌గ‌బోయో అస్కార్ వేడుక‌ల్లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అవ‌కాశం ద‌క్కింది. అమెరికా టెలివిజ‌న్ కార్య‌క్ర‌మం క్వాంటి కో తో ఇప్ప‌టికే ప్రియాంక చోప్రాకు అక్క‌డ బాగా గుర్తింపు వ‌చ్చింది. ఆ అవార్డుల వేడుక‌లో పాల్గొనే వారి జాబితాను ఆస్కార్ కమిటి రిలీజ్ చేశారు. ఈ జాబితో ప్రియాంక చోప్రా పేరు కూడా ఉంది. ఈ మ‌ధ్య పీపుల్స్ ఛాయ‌స్ గా అవార్డు అందుకున్న ప్రియాంక కు అస్కార్ వేడుక‌ల్లో పాల్గొనే అవ‌కాశం రావ‌డం ఆమె తో పాటు భార‌తీయ న‌టీ న‌టుల‌కు శుభ సూచికం అనే చెప్పాలి. ఈ నెల 28 న అస్కార్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

First Published:  3 Feb 2016 5:07 AM GMT
Next Story