Telugu Global
Cinema & Entertainment

కొరటాల దర్శకత్వంలో రామ్ చరణ్

కొరటాల శివ, రామ్ చరణ్ మూవీ ఎప్పుడో కన్ ఫర్మ్ కావాల్సింది. ఈపాటికి చెర్రీ ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ కూడా పడాల్సింది. కానీ ఎన్టీఆర్ లా… చరణ్ కూడా కొరటాలను అనుమానించాడు. కాబట్టి అప్పట్లో తారక్, చెర్రీ ఇద్దర్నీ కాదని…. మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు కొరటాల. అలా మహేష్-కొరటాల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అయింది. కొరటాల స్టామినా ఎంటో తారక్, చెర్రీకి తెలిసొచ్చింది. అందుకే వెంటనే తారక్…. కొరటాలతో […]

కొరటాల దర్శకత్వంలో రామ్ చరణ్
X
కొరటాల శివ, రామ్ చరణ్ మూవీ ఎప్పుడో కన్ ఫర్మ్ కావాల్సింది. ఈపాటికి చెర్రీ ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ కూడా పడాల్సింది. కానీ ఎన్టీఆర్ లా… చరణ్ కూడా కొరటాలను అనుమానించాడు. కాబట్టి అప్పట్లో తారక్, చెర్రీ ఇద్దర్నీ కాదని…. మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు కొరటాల. అలా మహేష్-కొరటాల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అయింది. కొరటాల స్టామినా ఎంటో తారక్, చెర్రీకి తెలిసొచ్చింది. అందుకే వెంటనే తారక్…. కొరటాలతో కలిసి జనతా గ్యారెజీ పనులు స్టార్ట్ చేశాడు. ఆ వెంటనే రామ్ చరణ్ కూడా మేల్కొని… కొరటాలను తన నెక్ట్స్ సినిమాకు కన్ ఫర్మ్ చేసుకున్నాడు. అలా…. తారక్ తో సినిమా ప్రారంభంకాకముందే… చెర్రీ సినిమాను పట్టేశాడు కొరటాల. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ఓ రీమేక్ సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివతో సినిమా మొదలవుతుంది.
First Published:  2 Feb 2016 10:32 PM GMT
Next Story