మెగా, బాలయ్య ఫ్యామిలీల హీరోలతో సినిమా

ఇండ‌స్ట్రీలో  అభిమానులు.. హీరోలు ప‌రంగా కూడా  ఒక సెగ్రిగేష‌న్  ఉంద‌న్న విష‌యం కాద‌న‌లేనిది.  చిరంజీవి కుటుంబ హీరోలది ఒక గ్రూప్. నంద‌మూరి  హీరోల‌ద‌రి మ‌రో గ్రూప్. అలాగే అభిమానులు కూడా ఈ రెండు గ్రూప్ లో ఏదో ఒక దానికి వుంటారు.  ఆఫ్ కోర్స్ మ‌హేష్ బాబు, ప్ర‌భాస్  ల‌కు కూడా ఫ్యాన్స్ వుంటారు.   ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా  బాల‌కృష్ణు అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు.  స్వ‌యం కృషి తో చిరంజీవి  మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన నిర్మించిన ప్లాట్ ఫామ్ ను ఆధారం చేసుకుని ఆయ‌న త‌మ్ముళ్లు.. అళ్లుల్లు..  అబ్బాయిలు  ఇలా ఎంట్రీలు కొడుతున్నారు.

బాల‌య్య‌, చిరు ఇద్ద‌రు స‌మ‌కాలికులు. ఇద్ద‌రికి అభిమాన ద‌ళాలున్నాయి. క‌ట్ చేస్తే వీరిద్ద‌రు క‌ల‌సి ఇంత వ‌ర‌కు న‌టించింది లేదు.  కానీ తాజాగా  ఈ రెండు కుటుంబాల హీరోల‌తో  ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి  ఒక చిత్రం చేసే ఆలోచ‌న చేస్తున్నాడ‌నే వార్త ప్ర‌స్తుతం ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తుంది. చిరు మేనల్లుడు  సాయిధ‌ర‌మ్ తేజ తో ర‌వికుమార్ చౌద‌రి పిల్లా నీవు లేని జీవితం అంటూ ఒక మంచి హిట్ ఇచ్చాడు. క‌ళ్యాణ్ రామ్ తో వ్య‌క్తిగ‌తంగా మంచి  సానిహిత్యం ఉంది. దీంతో వీర‌ద్ద‌ర్ని పెట్టి మ‌ల్టీ యాక్ట‌ర్స్  ఫిల్మ్స్ ( వీరిద్ద‌ర్ని అప్పుడే స్టార్స్ అన‌లేం) చేసే ఆలోచ‌న డైరెక్ట‌ర్ ర‌వికుమార్ చౌద‌రి చేస్తున్న‌ట్లు స‌మ‌చారం. మరి నిజంగా ఈ ప్రాజెక్ట్  ప‌ట్టాలెక్కితే  .. ఎలా వుంటుందో క‌దా.!  ఇక  ర‌వికుమార్ చౌద‌రి గోపిచంద్ హీరోగా సౌఖ్యం అంటూ  ఈ మ‌ధ్య ఒక సినిమా చేసిన విష‌యం తెలిసిందే.  సినిమా డిజాస్ట‌ర్ అనే టాక్ తెచ్చుకుంది.