Telugu Global
Health & Life Style

డ్రైవింగ్ మానేస్తే డీలా ప‌డతార‌ట‌!

దీర్ఘ‌కాలం పాటు డ్రైవింగ్ చేసి ఉన్న‌వారు, పెరుగుతున్న వ‌య‌సు, ఆనారోగ్యం ఇత‌ర కార‌ణాల వ‌ల‌న దాన్ని మానేస్తే కొన్ని నెగెటివ్ ఫ‌లితాలు ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని వైద్యప‌రిశోధ‌కులు అంటున్నారు. ఈ విష‌యంపై నిర్వ‌హించిన 16 ప‌రిశోధ‌న‌ల‌ను స‌మీక్షించి ఈ ఫ‌లితాల‌ను తేల్చారు. పెరుగుతున్న వ‌య‌సు వ‌ల‌న డ్రైవింగ్  మానేసిన‌వారిలో అత్యంత వేగంగా మాన‌సిక‌, శారీర‌క స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సీనియ‌ర్ సిటిజ‌న్లలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు పెరుగుతున్నాయ‌ని గ‌మ‌నించారు. అయితే డ్రైవింగ్ మానేయ‌డం వ‌ల‌న వారిలో […]

డ్రైవింగ్ మానేస్తే డీలా ప‌డతార‌ట‌!
X

దీర్ఘ‌కాలం పాటు డ్రైవింగ్ చేసి ఉన్న‌వారు, పెరుగుతున్న వ‌య‌సు, ఆనారోగ్యం ఇత‌ర కార‌ణాల వ‌ల‌న దాన్ని మానేస్తే కొన్ని నెగెటివ్ ఫ‌లితాలు ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని వైద్యప‌రిశోధ‌కులు అంటున్నారు. ఈ విష‌యంపై నిర్వ‌హించిన 16 ప‌రిశోధ‌న‌ల‌ను స‌మీక్షించి ఈ ఫ‌లితాల‌ను తేల్చారు. పెరుగుతున్న వ‌య‌సు వ‌ల‌న డ్రైవింగ్ మానేసిన‌వారిలో అత్యంత వేగంగా మాన‌సిక‌, శారీర‌క స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డుతున్నాయ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సీనియ‌ర్ సిటిజ‌న్లలో డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు పెరుగుతున్నాయ‌ని గ‌మ‌నించారు. అయితే డ్రైవింగ్ మానేయ‌డం వ‌ల‌న వారిలో స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయా, అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల‌నే డ్రైవింగ్ మానేయ‌డం వ‌ల‌న అలా అనిపిస్తోందా…అనే ప్ర‌శ్న వేసుకుంటే… రెండూ ఒక‌దానిమీద ఒక ఆధార‌ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి.

వ‌య‌సుతో పాటు వ‌చ్చే అనారోగ్యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నా, డ్రైవింగ్ మానేసిన వారిలో, అలాంటి ల‌క్ష‌ణాలే ఉండి ఇంకా డ్రైవింగ్ చేస్తున్న‌వారితో పోలిస్తే డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు రెండింత‌లు ఎక్కువ‌గా క‌నిపించాయి. అలాగే కొన్ని అధ్య‌య‌నాల్లో పెద్ద‌వారు డ్రైవింగ్ మానేసిన కొంత‌కాలంలోనే త‌మ శారీర‌క ఆరోగ్యం క్షీణించింద‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి, మాన‌సిక సామ‌ర్ధ్యం త‌గ్గిపోతున్నాయ‌ని చెప్పారు. అన్ని ఆరోగ్య ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా, డ్రైవింగ్ మానేసిన వారికంటే, మాన‌ని వారు ఎక్కువ‌కాలం జీవించిన‌ట్టుగా కూడా నిపుణులు గ‌మ‌నించారు. దీర్ఘ‌కాల ఆరోగ్యం, ఆయుష్షుల‌కు చురుగ్గా ఉండ‌టం…అవ‌స‌ర‌మ‌ని ఈ అధ్య‌యనాలు సైతం రుజువు చేస్తున్నాయి.

First Published:  4 Feb 2016 7:30 AM GMT
Next Story