బాహుబలిపై ఏకంగా ప్రధానికే లేఖ

బాహుబలి సినిమాతో రాజమౌళి చాలా పెద్ద తప్పుచేశాడని, అతడ్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే ఓ లేఖ అందింది. హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ… ఈ ఉత్తరాన్ని రాసింది. బాహుబలి సినిమాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఏనుగును వాడుకున్నారని…. భారీ విద్యుత్ బల్బుల కింద… ఏకంగా 4 గంటల పాటు ఆ ఏనుగును నిలబెట్టి చిత్రహింసలకు గురిచేశారని  ఆ లేఖలో ఆరోపించారు. జంతు పరిరక్షణ చట్టాల కింద… బాహుబలి నిర్మాతల్ని, దర్శకుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఉత్తరంలో డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతుల్ని…. నిర్మాతలు శోభ యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ తో పాటు దర్శకుడు రాజమౌళికి కూడా పంపించారు. అయితే బాహుబలి షూటింగ్ సమయంలో… ఏనుగును ఉపయోగించిన అంశానికి సంబంధించి మేకర్స్… కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.