మొనగాడు ఎవరో తాళం మీద చేయి వేయాలి!

ఏపీలో కాంగ్రెస్ స్టామినా ఎంతో మరోసారి రుజువైంది.  కర్నూలు కాంగ్రెస్ కార్యాలయానికి పడ్డ తాళమే హస్తబలమెంతో కళ్లకు కట్టినట్టు చూపుతోంది.  కర్నూలులో కాదుకాదు స్టేట్‌ కాంగ్రెస్‌లోనే మొనగాడు ఎవరో రమ్మని తాళం పిలుస్తోంది.

ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో రాహుల్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కోట్ల కూడా వెళ్లారు. అయితే సభ వేదిక వద్దకు సూర్యప్రకాశ్‌ రెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. అవమాన భారంతో వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. కోట్లకు జరిగిన అవమానంతో రగిలిపోయిన అనుచరులు రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. దాన్ని తెరిచేవాడే లేడు.

పరిస్థితి గమనించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వరుస పెట్టి  బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కోట్ల మాత్రం తగ్గడం లేదు. చర్చల కోసం ఇంటికొచ్చిన నేతలకు కడుపునిండ భోజనం పెట్టి పంపుతున్నారే గానీ వెనక్కు తగ్గడం లేదు. ఏఐసీసీ నాయకులే వచ్చి క్షమాపణలు చెప్పాలని తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే పల్లంరాజు, బాపిరాజు, శైలజనాథ్ వంటివారు కోట్లను శాంతపరిచేందుకు విఫలయత్నం చేశారు. రఘువీరా రెడ్డి కూడా రంగంలోకి దిగారు. అయితే..

కాంగ్రెస్‌ పరువు గంగలో కలుస్తున్నది ఇక్కడ కాదు జిల్లా కార్యాలయానికి వేసిన తాళాన్ని కూడా తాకేవారు లేకపోవడమే హస్తంపార్టీ పరువును పక్కనే ఉన్న తుంగభద్రలో కలిపేస్తోంది.  కోట్లను పార్టీలోకి తెచ్చేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నించారు. అయితే కోట్ల అంగీకరించలేదు. చూడాలి కోట్ల కోసం ఏఐసీసీ పెద్దలు వస్తారో… జిల్లా కార్యాలయానికి పడ్డ తాళం తెరిచే మొనగాడు ఎవరో?

Click on image to Read 

cbn

jagan-chandrababu

babu-security

 

98989

 

assange

 

 

akbaruddin-owaisi-sonia-rahul

 

velagapudi-tdp-1

ravindranath-reddy

chintamaneni-leez

balakrishna-mla

kapu-sangam

botsa

tdp-mla

cbn-kapu-leaders