Telugu Global
NEWS

హోంమంత్రి మరీ అంత వీకా?

కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష మొదలుపెట్టారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన నివాసంలో భార్యతో కలిసి అమరణ దీక్షకు దిగారు. కిర్లంపూడి గ్రామంలో భారీగా 2 వేల మంది పోలీసులు మోహరించారు.  కంచంపై గరిటతో శబ్దం చేస్తూ నిరసన తెలిపారు.  టీడీపీ మేనిఫెస్టోలో చెప్పడం వల్లే తాము రిజర్వేషన్ల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. మంజునాథన్‌ కమిటీ తన నివేదిక అందజేసేందుకు మూడు నెలలు మాత్రమే గడువుగా విధించాలని డిమాండ్ చేశారు. […]

హోంమంత్రి మరీ అంత వీకా?
X

కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష మొదలుపెట్టారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన నివాసంలో భార్యతో కలిసి అమరణ దీక్షకు దిగారు. కిర్లంపూడి గ్రామంలో భారీగా 2 వేల మంది పోలీసులు మోహరించారు. కంచంపై గరిటతో శబ్దం చేస్తూ నిరసన తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పడం వల్లే తాము రిజర్వేషన్ల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. మంజునాథన్‌ కమిటీ తన నివేదిక అందజేసేందుకు మూడు నెలలు మాత్రమే గడువుగా విధించాలని డిమాండ్ చేశారు. కొందరు నేతలు చెబుతున్న పేర్ల ఆధారంగానే కాపు గర్జనకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

హోంగార్డును కూడా బదిలీ చేయించలేని హోంమంత్రి చాలా పెద్దవారని… వారితో తాను సరితూగనంటూ సెటైర్లు వేశారు. హోంమంత్రి విమర్శలకు తాను స్పందించనన్నారు. నిజానికి తలుపులేసుకుని ఇంటిలోనే దీక్ష చేయాలనుకున్నానని… అయితే తమపై కేసులు నమోదు చేశారని తలుపులేసుకుంటే అరెస్ట్‌ కు భయపడే అలా చేశారన్న భావన కలిగే అవకాశం ఉందన్నారు. తమ జాతి ఓట్లతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు మాత్రం కాపులపై పత్రికల ద్వారా ఎదురుదాడి చేయిస్తున్నారని ముద్రగడ విమర్శించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలులోనే ఉంది.

Click on image to Read

kotla-suryaprakash-reddy

cbn

babu-security

assange

kcr

akbaruddin-owaisi-sonia-rahul

jagan-chandrababu

velagapudi-tdp-1

ravindranath-reddy

chintamaneni-leez

balakrishna-mla

kapu-sangam

botsa

tdp-mla

cbn-kapu-leaders

First Published:  5 Feb 2016 12:39 AM GMT
Next Story