Telugu Global
Cinema & Entertainment

హమ్మయ్య మొత్తానికి సాధించాడు...

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లు ఆర్జించిన చిత్రంగా నాన్నకు ప్రేమతో సినిమా రికార్డు సృష్టించింది. మొన్నటివరకు మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడానికి నానా ఇబ్బందులు పడ్డాడు తారక్. 10లక్షల డాలర్లు సంపాదించడానికి తహతహలాడాడు. అలాంటిది ఒకేఒక్క సినిమాతో ఏకంగా 20లక్షల డాలర్లు ఆర్జించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. తాజా లెక్కల ప్రకారం…. ఫిబ్రవరి 4 నాటికి ఓవర్సీస్ లో నాన్నకు ప్రేమతో […]

హమ్మయ్య మొత్తానికి సాధించాడు...
X

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లు ఆర్జించిన చిత్రంగా నాన్నకు ప్రేమతో సినిమా రికార్డు సృష్టించింది. మొన్నటివరకు మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడానికి నానా ఇబ్బందులు పడ్డాడు తారక్. 10లక్షల డాలర్లు సంపాదించడానికి తహతహలాడాడు. అలాంటిది ఒకేఒక్క సినిమాతో ఏకంగా 20లక్షల డాలర్లు ఆర్జించిన హీరోగా చరిత్ర సృష్టించాడు. తాజా లెక్కల ప్రకారం…. ఫిబ్రవరి 4 నాటికి ఓవర్సీస్ లో నాన్నకు ప్రేమతో సినిమా అధికారికంగా 20లక్షల డాలర్లు ఆర్జించినట్టు ప్రకటించారు. అయితే రికార్డు సృష్టించినప్పటికీ… టాప్ లో మాత్రం తారక్ లేడు. అగ్రస్థానం బాహుబలిది కాగా… రెండో స్థానంలో శ్రీమంతుడు నిలిచాడు. ముచ్చటగా మూడో ప్లేస్ లో ఎన్టీఆర్ సెటిల్ అయ్యాడన్నమాట. మహేష్ స్థానాన్ని కొల్లగొట్టడానికి కూడా ఇప్పుడు తారక్ కు స్కోప్ లేదు. ఎందుకంటే… ఓవర్సీస్ లో నాన్నకు ప్రేమతో సినిమాకు ఇప్పుడు పెద్దగా వసూళ్లు లేవు. సో… ప్రస్తుతానికి ఓవర్సీస్ లో తారక్ మూడో స్థానానికే పరిమితం.

First Published:  5 Feb 2016 12:28 AM GMT
Next Story