Telugu Global
Cinema & Entertainment

లేనిదే... స్పీడు

రేటింగ్‌ : 2/5 విడుదల తేదీ : 5 ఫిబ్రవరి 2016 దర్శకత్వం :  భీమినేని శ్రీనివాస్‌ ప్రొడ్యూసర్‌ : భీమినేని సునీత, భీమినేని రుషితా సాయి బ్యానర్‌ : గుడ్‌విల్‌ సినిమా సంగీతం : శ్రీవాసంత్‌ నటీనటులు : భీమినేని శ్రీనివాస్‌, సొనారికా, ప్రకాష్‌రాజ్‌, తమన్నా వందల ఏళ్ళక్రితం షేక్‌స్పియర్‌ “కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌” అనే నాటకం రాసాడు. దీని ఆధారంగా బోలెడు సినిమాలొచ్చాయి. షేక్‌స్పియర్‌కి కృతజ్ఞతలు చెబుతూ గుల్జార్‌ “అంగూర్‌” తీసాడు. ఇదే సినిమాని ఎవరికీ […]

లేనిదే... స్పీడు
X

రేటింగ్‌ : 2/5
విడుదల తేదీ : 5 ఫిబ్రవరి 2016
దర్శకత్వం : భీమినేని శ్రీనివాస్‌
ప్రొడ్యూసర్‌ : భీమినేని సునీత, భీమినేని రుషితా సాయి
బ్యానర్‌ : గుడ్‌విల్‌ సినిమా
సంగీతం : శ్రీవాసంత్‌
నటీనటులు : భీమినేని శ్రీనివాస్‌, సొనారికా, ప్రకాష్‌రాజ్‌, తమన్నా

వందల ఏళ్ళక్రితం షేక్‌స్పియర్‌ “కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌” అనే నాటకం రాసాడు. దీని ఆధారంగా బోలెడు సినిమాలొచ్చాయి. షేక్‌స్పియర్‌కి కృతజ్ఞతలు చెబుతూ గుల్జార్‌ “అంగూర్‌” తీసాడు. ఇదే సినిమాని ఎవరికీ కృతజ్ఞతలు చెప్పకుండా కన్నడంలో ఈసినిమాని తీసారు. ఈ విషయంలో తెలియక కన్నడ వాళ్ళతో రైట్స్‌ కొనుక్కుని మనవాళ్ళు తీసేశారు. ఇది జరిగి చాలా ఏళ్ళయ్యింది. ఇప్పుడు నేనిచ్చిన ఇంట్రడక్షన్‌కి, స్పీడున్నోడు సినిమాకి ఏమీ సంబంధంలేదు. అలాగే స్పీడుకి, ఈసినిమాకి కూడా ఏమీ సంబంధం లేదు. ఈ మాత్రం కథని తమిళవాళ్ళతో కొని తీయడమెందుకు? మనమే రాసుకోవచ్చు.

ఒకప్పుడు వోవరాక్షన్‌కి తమిళవాళ్ళు పేరుగాంచారు. ఆ తరువాత కొంచెం తగ్గించుకుని సెట్‌రైట్‌ అయ్యారు. అయితే ఒక్కోసారి కథలో చాలా తీవ్రంగా వెళతారు. మానవసంబంధాలపైనే భయం కలిగించేలా తీస్తారు. బహుశా వాళ్ళ నేటివిటికి అది సరిపోతుందేమో! తెలుగువాళ్ళు చాలా సెన్సిటివ్‌. ఎమోషన్స్‌ని ఎక్కువ ఇష్టపడతారు. హింసని కొంతవరకూ చూస్తారు కానీ శ్రుతిమించితే చూడలేరు.

మన హీరోలకి కథమీదకంటే తమమీద తమకి ప్రేమ ఎక్కువ. అందుకే చాలా సినిమాల్లో క్యారెక్టర్‌కి బదులు హీరోలే కనిపిస్తారు. ఒకవేళ ప్రేక్షకుడి ఖర్మగాలి హీరోలో క్యారెక్టర్‌ని చూడ్డానికి మొదలుపెట్టినా దర్శకులు వూరుకోరు. తెరపై ఉన్నది అఖిల్‌ అని, మెగామీటరని, బెల్లంకొండ అని గుర్తుచేస్తూ సాంగ్స్‌వేస్తారు.

స్నేహితుల మధ్య గొడవలొస్తే అనే పాయింట్‌ స్పీడున్నోడు సినిమా మూలకథ. అయితే ఆ విషయం ఎక్కడా ఎస్టాబ్లిష్‌ కాకుండా భీమినేని శ్రీనివాసరావు జాగ్రత్తపడ్డాడు. చివరి 20 నిముషాల్లో మనకు అసలు దర్శకుడు తమిళంలోంచి కొన్న కథేంటో అర్ధమవుతుంది.

ముగ్గురు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ముగ్గురిని ప్రేమించడం సాధ్యంకాదు కాబట్టి హీరోనే ప్రేమిస్తుంది. మిగిలినవాళ్ళు హీరోపై పగబడతారు. వినడానికి బావుంది. అయితే రహదారిలో వెళ్ళాల్సిన కథని రాయలసీమ ఫ్యాక్షన్‌పైన, బండలగనుల్లో, కొడవళ్ళు కత్తుల మధ్య తీసుకెళ్ళి సహనాన్ని పరీక్షిస్తాడు డైరెక్టర్‌.

సినిమా ప్రారంభంలోనే రాయలసీమ గురించి చెబితే ఫ్యాక్షన్‌ కథేమో అనిపిస్తుంది. ఆ తరువాత ప్రకాష్‌రాజ్‌, రావురమేష్‌ చెరో వూరి పెద్దమనుషులుగా కనిపిస్తే రెండు కుటుంబాల గొడవేమో అని అనుమానం వస్తుంది. కానీ ఒకే బస్సులో కాలేజికి వెళ్ళే హీరోయిన్‌, ఆమెకి లైన్‌వేసే మిత్రబృందం… ఈ రకంగా కథ ల్యాండవుతుంది. ఎంతకీ టేకాఫ్‌ తీసుకోదు.

హీరో పక్కన ఫ్రెండ్‌గా శ్రీనివాసరెడ్డి మాత్రమే చాలా సీన్స్‌లో ఉంటాడు. మిగిలిన వాళ్ళతో బలమైన స్నేహబంధం వున్నట్టు ఎస్టాబ్లిష్‌ కాదు. లవ్‌ మ్యాటర్స్‌, పంచ్‌, ప్రాస డైలాగులతో కామెడి సృష్టించే ప్రయత్నం జరిగింది. కథతో లింక్‌కాకుండా డైలాగ్‌లో కామెడీ రాదు. పంచ్‌లు, ప్రాసలకి కూడా కాలంచెల్లిపోతూవుంది. ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. “ట్రాఫిక్‌ జాం పై కోపంతో టైరు పంచర్‌ చేసుకున్నట్టు” అని ఒక డైలాగ్‌ ఉంది. ఇది ప్రాసడైలాగే తప్ప, కామెడి ఎక్కడుంది. అయితే చాలాచోట్ల ఈసినిమాలో డైలాగ్‌లు బావున్నాయి. ఒకచోట “లవ్‌ అంటే లూజ్‌మోషన్స్‌, వస్తే ఆపుకోలేం” అనే బండ డైలాగ్‌ కూడా ఉంది.

పాటలు బావున్నాయి. తమన్నా పాటవల్ల ప్లస్‌ అయ్యింది ఏమీలేదు. శ్రీనివాస్‌ ఫైట్స్‌, డాన్స్‌లు బాగాచేసాడు. అయితే నటన మెరుగు పడలేదు. ఫీల్‌ పండలేదు. హీరోయిన్‌ గురించి చెప్పడానికి ఏమీలేదు. ప్రకాష్‌రాజ్‌వున్నా ఆయనకేం స్కోప్‌ లేదు.

కథ అనంతపురంలో నడిచినా, కొంతమంది సీమయాస, చాలామంది గుంటూరు, గోదావరి యాస మాట్లాడుతారు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. స్నేహితుల మీదకాకుండా హీరోపైనే కథ నడపడంవల్ల క్లైమాక్స్‌ రక్తికట్టలేదు.

ఈ సినిమాలో లేనిదేస్పీడు, ఆ పేరెందుకు పెట్టారో మరి!

-జి ఆర్‌. మహర్షి

Click on Image to Read

speedunodu-tamannah

chiru-balakrishna

bahubali

First Published:  5 Feb 2016 2:03 AM GMT
Next Story