Telugu Global
Cinema & Entertainment

తెలుగులో నెంబ‌ర్ వ‌న్ అల్లు అర్జునేనా..!

సోష‌ల్ నెట్ వ‌ర్క్ అనేది సెలబ్రిటీల‌కు మరియు వారి అభిమానుల‌కు మ‌ధ్య ఒక వారిధి గా ప‌ని చేస్తోంది అంటే అతి శ‌యోక్తి కాదు. హాలీవుడ్ టు టాలీవుడ్ పాపుల‌ర్ సెలబ్రిటీలంద‌రు త‌మ అఫిషియ‌ల్ సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా ఫ్యాన్స్ కు ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్ లో వుంటుంటారు. మన తెలుగులో కూడా బాహుబ‌లి చిత్రం మొదలైనప్పటి నుంచి హీరోలు కూడా సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను యాక్టివ్ గా ఫాలో కావ‌డం పెరిగింది. అంత‌కు ముందు […]

తెలుగులో నెంబ‌ర్ వ‌న్ అల్లు అర్జునేనా..!
X

సోష‌ల్ నెట్ వ‌ర్క్ అనేది సెలబ్రిటీల‌కు మరియు వారి అభిమానుల‌కు మ‌ధ్య ఒక వారిధి గా ప‌ని చేస్తోంది అంటే అతి శ‌యోక్తి కాదు. హాలీవుడ్ టు టాలీవుడ్ పాపుల‌ర్ సెలబ్రిటీలంద‌రు త‌మ అఫిషియ‌ల్ సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా ఫ్యాన్స్ కు ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్ లో వుంటుంటారు. మన తెలుగులో కూడా బాహుబ‌లి చిత్రం మొదలైనప్పటి నుంచి హీరోలు కూడా సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను యాక్టివ్ గా ఫాలో కావ‌డం పెరిగింది. అంత‌కు ముందు వ‌ర‌కు కాజ‌ల్, త‌మ‌న్నా,స‌మంత వంటి హీరోయిన్స్ మాత్ర‌మే ఎక్కువుగా సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను ఫాలో అయ్యే వారు.

క‌ట్ చేస్తే. తాజాగా బ‌న్ని ఒక విష‌యంలో తన తోటి హీరోల కన్నా అంద‌రికంటే నెంబ‌ర్ వ‌న్ గా వున్నాడు. త‌న ఫేస్ బుక్ ఫాలోయ‌ర్స్ సంఖ్య కోటి దాటింది. ద‌క్షిణ భార‌త దేశంలో ఏ హీరోకు లేని ఫాలోయింగ్ ఇది. ఫ్యాన్స్ కు ట‌చ్ లో వుంటూ..త‌న ప్రొఫెష‌న‌ల్ అండ్ ప‌ర్స‌న‌ల్ విశేషాలు పంచుకుంటు ఉండ‌ట‌మే ఈ అచీవ్ మెంట్ సీక్రేట్ అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక స‌రైనోడు చిత్రంతో అభిమానుల్ని అల‌రించ‌డానికి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను తో క‌ల‌సి సిద్దం అవుతున్నాడు. మ‌హేష్ బాబు, ప‌వ‌న్ కు కూడా లేన్నంత ఫాలోవ‌ర్స్ బ‌న్నీకి వుండ‌టం విశేష‌మే మ‌రి.

https://www.facebook.com/AlluArjun/

First Published:  6 Feb 2016 6:01 AM GMT
Next Story