Telugu Global
NEWS

జేసీ ఆచూకీ దొరికింది- అక్క‌డా గ‌నులున్నాయా ?

త‌న అనుచ‌రుల‌కు ఫెయిడ్ గ‌న్‌మెన్ల‌ను కేటాయించ‌డంపై కినుక వ‌హించిన తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వారం రోజులుగా క‌నిపించ‌డం లేదు. అనుచ‌రులకు ఉచితంగా గ‌న్‌మెన్లు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ త‌న గ‌న్‌మెన్ల‌ను కూడా ప్ర‌భాక‌ర్ రెడ్డి వెన‌క్కు పంపించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. జేసీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని కొంద‌రు, హైద‌రాబాద్‌లో ఉన్నార‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రిగింది. అయితే రూమ‌ర్ల‌పై ఆయ‌న అన్న ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త‌న […]

జేసీ ఆచూకీ దొరికింది- అక్క‌డా గ‌నులున్నాయా ?
X

త‌న అనుచ‌రుల‌కు ఫెయిడ్ గ‌న్‌మెన్ల‌ను కేటాయించ‌డంపై కినుక వ‌హించిన తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వారం రోజులుగా క‌నిపించ‌డం లేదు. అనుచ‌రులకు ఉచితంగా గ‌న్‌మెన్లు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ త‌న గ‌న్‌మెన్ల‌ను కూడా ప్ర‌భాక‌ర్ రెడ్డి వెన‌క్కు పంపించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. జేసీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని కొంద‌రు, హైద‌రాబాద్‌లో ఉన్నార‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రిగింది. అయితే రూమ‌ర్ల‌పై ఆయ‌న అన్న ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

త‌న సోద‌రుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోలేద‌ని దక్షిణాఫ్రికా వెళ్లార‌ని దివాక‌ర్ రెడ్డి మీడియాతో తెలిపారు. గ‌న్ మెన్ల వ్య‌వ‌హారం తాను జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద‌ది కాదని జేసీ అన్నారు. త‌న త‌మ్ముడు అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారం మీడియా సృష్టేన‌న్నారు. ద‌క్షిణాఫ్రికా టూర్ చాలా కాలం క్రిత‌మే ఫిక్స్ అయింద‌న్నారు.

తుని ఘ‌ట‌న త‌ర్వాత సీఎం, హోంమంత్రి బిజీగా ఉన్నార‌ని ఈ స‌మ‌యంలో గ‌న్‌మెన్ల వ్య‌వ‌హారం వారితో చ‌ర్చించ‌డం ప‌ద్ద‌తి కాద‌ని అందుకే ప్ర‌భాక‌ర్ రెడ్డి దక్షిణాఫ్రికా వెళ్లార‌ని తెలుస్తోంది. ప‌దేళ్ల‌ నుంచి దక్షిణాఫ్రికాలో జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన తనయుడు జేసీ అశ్మిత్‌రెడ్డి పలు వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని గనులను కూడా లీజులకు తీసుకొని నడుపుతున్నారని చెబుతుంటారు. వాటి ప‌ని మీద ప్ర‌భాక‌ర్ రెడ్డి దక్షిణాఫ్రికా వెళ్లార‌ని తెలుస్తోంది.

Click on image to Read

jagan

danam-nagender

tdp-media

babu-ghmc-elections

ts-tdp

revanth-reddy

muralimohan

revanth-reddy

collector

narayana-ghmc-election-results

kotla-suryaprakash-reddy

jagan-chandrababu

akbaruddin-owaisi-sonia-rahul

kapu-sangam

First Published:  6 Feb 2016 3:30 AM GMT
Next Story