Telugu Global
National

మరో పిహెచ్‌డీ విద్యార్ధి ఆత్మహత్య

రోహిత్‌ ఆత్మహత్య ఘటన మరవకముందే రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మోహిత్‌ కుమార్‌ చౌహాన్‌ అనే మేథమ్యాటిక్స్‌ పిహెచ్‌డీ విద్యార్ధి శుక్రవారం సాయంత్రం 8గంటలకు తన హాస్టల్‌ గదిలో ఉరేసుకొని చనిపోయాడు. మోహిత్‌ ఆత్మహత్యకు కొద్ది గంటలముందే ఆయన పిహెచ్‌డీ గైడ్‌తో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. గైడ్‌ వేధింపుల కారణంగానే మోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు యూనివర్శిటీ విద్యార్ధులు చెబుతున్నారు. సెంట్రల్‌ యూనివర్శిటీల్లో రిజర్వేషన్ల కారణంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులు సీట్లుపొందడం, వాళ్లల్లో కొందరికి ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం […]

మరో పిహెచ్‌డీ విద్యార్ధి ఆత్మహత్య
X

రోహిత్‌ ఆత్మహత్య ఘటన మరవకముందే రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో మోహిత్‌ కుమార్‌ చౌహాన్‌ అనే మేథమ్యాటిక్స్‌ పిహెచ్‌డీ విద్యార్ధి శుక్రవారం సాయంత్రం 8గంటలకు తన హాస్టల్‌ గదిలో ఉరేసుకొని చనిపోయాడు. మోహిత్‌ ఆత్మహత్యకు కొద్ది గంటలముందే ఆయన పిహెచ్‌డీ గైడ్‌తో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. గైడ్‌ వేధింపుల కారణంగానే మోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు యూనివర్శిటీ విద్యార్ధులు చెబుతున్నారు.
సెంట్రల్‌ యూనివర్శిటీల్లో రిజర్వేషన్ల కారణంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులు సీట్లుపొందడం, వాళ్లల్లో కొందరికి ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేకపోవడంతో చదువుల్లో కొంత వెనకబడుతున్నారు. శూద్రులకు చదువెందుకు అనుకునే కొందరు అగ్రవర్ణ ప్రొఫెసర్లు వీళ్లను అనుక్షణం కించపరుస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ, వ్యంగ్యబాణాలు విసురుతూ కొందరి విద్యార్ధుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని, వాళ్లకు చదువుపట్ల, జీవితంపట్ల విరక్తి కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి ఆత్మహత్యల పరంపరను అధ్యయనం చేసిన మేధావులు చెబుతున్నారు.

First Published:  5 Feb 2016 11:47 PM GMT
Next Story