Telugu Global
Cinema & Entertainment

ప్రియాంక పై మ‌న‌సు పారేసుకున్నాడా?

దేనికైన స‌మ‌యం రావాలంటారు కొంద‌రు.  ఆ ..యాంగిల్ లో   ఇప్పుడు  బాలీవుడ్ న‌టి ప్రియాంక కు బాగా మంచి టైమ్ న‌డుస్తోంది.  గ‌తంలో  పిటుబుల్  తో క‌ల‌సి ఒక ఆల్బ‌మ్లో హాట్ హాట్ గా న‌టించి ..హాలీవుడ్  కు ప‌రిచ‌యం అయ్యింది. త‌న అందంలో వున్న ఆక‌ర్ష‌ణ కు   అక్క‌డ యూత్ బాగానే  ఎట్రాక్ట్ అవుతుండ‌టంతో..  ఈ మ‌ధ్య క్వాంటికో అనే ఒక టెలివిజ‌న్  షో లో న‌టించింది.  ఈ షో సూప‌ర్ హిట్ కావ‌డంతో  ప్ర‌స్తుతం   హాలీవుడ్ […]

ప్రియాంక పై మ‌న‌సు పారేసుకున్నాడా?
X

దేనికైన స‌మ‌యం రావాలంటారు కొంద‌రు. ఆ ..యాంగిల్ లో ఇప్పుడు బాలీవుడ్ న‌టి ప్రియాంక కు బాగా మంచి టైమ్ న‌డుస్తోంది. గ‌తంలో పిటుబుల్ తో క‌ల‌సి ఒక ఆల్బ‌మ్లో హాట్ హాట్ గా న‌టించి ..హాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. త‌న అందంలో వున్న ఆక‌ర్ష‌ణ కు అక్క‌డ యూత్ బాగానే ఎట్రాక్ట్ అవుతుండ‌టంతో.. ఈ మ‌ధ్య క్వాంటికో అనే ఒక టెలివిజ‌న్ షో లో న‌టించింది. ఈ షో సూప‌ర్ హిట్ కావ‌డంతో ప్ర‌స్తుతం హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పేరు అక్క‌డ హీరోస్ లో కూడ మోగుతుంది. ఈ నెల లోజ‌రిగే అస్కార్ అవార్డుల వేడుక‌కు..అతిథిగా కూడా ఎంపిక అయ్యింది.

కట్ చేస్తే..క్వాంటికో షో లో త‌న స‌ర‌స‌న న‌టించిన రేనాల్డ్స్ ప్రియాంక చోప్రా పై మ‌న‌సు ప‌డ్డాడ‌ట‌. అంటే వేరే అర్ధం చేసుకోవ‌ద్దండోయ్. ఆమే తో క‌ల‌సి సినిమా చేయాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్త ప‌రిచిన‌ట్లు టాక్. క్వాంటికో షో విడుదలైన త‌రువాత‌.. హాలీవుడ్ లోను ప్రియాంక అనేక ఇంట‌ర్వూస్ లో క‌నిపించ‌డం..స్క్రీన్ పై ప్రియాంక చోప్రా కెమిస్ట్రి అద‌ర‌హొ అనిపించేలా ఉండ‌టంతో.. ప్ర‌స్తుతం ప్రియాంక అక్క డ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంటుంది మ‌రి.

First Published:  5 Feb 2016 10:37 PM GMT
Next Story