Telugu Global
Cinema & Entertainment

ఆ హీరోకు కూడా వైట్ల లోకువయ్యాడా...

 ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చే హీరో కరువయ్యాడు. అఖిల్ రెండో సినిమాకు వైట్ల మెగాఫోన్ పడతాడని అంతా ఆశించినప్పటికీ… బ్రూస్ లీ రిజల్ట్ చూసి నాగార్జున వెనక్కుతగ్గాడు. నాగ్ మాత్రమే కాదు…. బ్రూస్ లీ దెబ్బకు వైట్లకు అవకాశం ఇవ్వాలనుకున్న చాలామంది హీరోలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అలా ప్రస్తుతం సైడ్ ట్రాక్ లో ఉన్న శ్రీనువైట్లతో…. సుధీర్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త హల్ చల్ […]

ఆ హీరోకు కూడా వైట్ల లోకువయ్యాడా...
X
ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చే హీరో కరువయ్యాడు. అఖిల్ రెండో సినిమాకు వైట్ల మెగాఫోన్ పడతాడని అంతా ఆశించినప్పటికీ… బ్రూస్ లీ రిజల్ట్ చూసి నాగార్జున వెనక్కుతగ్గాడు. నాగ్ మాత్రమే కాదు…. బ్రూస్ లీ దెబ్బకు వైట్లకు అవకాశం ఇవ్వాలనుకున్న చాలామంది హీరోలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అలా ప్రస్తుతం సైడ్ ట్రాక్ లో ఉన్న శ్రీనువైట్లతో…. సుధీర్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త హల్ చల్ చేసింది. మరీ ముఖ్యంగా మహేష్ నిర్మాతగా ఆ కాంబినేషన్ తెరపైకి రాబోతుందనే ప్రచారం సాగింది. భలే మంచిరోజు అనే సినిమా సక్సెస్ తో ఊపుమీదున్న సుధీర్ బాబుతో… శ్రీనువైట్ల సినిమా ఉండొచ్చని అంతా భావించారు కూడా. కానీ సుధీర్ బాబు మాత్రం గాలి తీసేశాడు. అదంతా ఉత్తిదే అని తేల్చేశాడు. సో… శ్రీనువైట్లకు ఇక్కడ కూడా డోర్ క్లోజ్ అన్నమాట. కానీ సుధీర్ బాబు చివర్లో ఓ మాట అన్నాడు. పుకారుగా వచ్చిన ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నట్టు ఆశించాడు.
First Published:  6 Feb 2016 5:40 AM GMT
Next Story