Telugu Global
Cinema & Entertainment

చిరు ఇక షూటింగ్‌కి సిద్ధం!

ముంబ‌యి, బ్రీచ్ కాండీ హాస్ప‌ట‌ల్‌లో భుజం ఆప‌రేష‌న్ చేయించుకున్న చిరంజీవి హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. వైద్యులు ఆయ‌న‌కు రెండువారాల‌పాటు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించారు. త‌న 150వ  సినిమా షూటింగ్‌కి ఎలాంటి ఆటంకం ఉండ‌కూడ‌ద‌నే, ఆయ‌న ఈ లోపే ఆప‌రేష‌న్ చేయించుకున్న విష‌యం తెలిసిందే.  డ్యాన్సులు లేని చిరంజీవి సినిమాని ఎవ‌రూ ఊహించ‌లేరు కాబ‌ట్టి త‌న 150వ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో ఆయ‌న నుండి మ‌నం అన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమా హంగుల‌నూ ఆశించ‌వ‌చ్చు. ఈ సినిమా షూటింగ్  మార్చి నెల […]

చిరు ఇక షూటింగ్‌కి సిద్ధం!
X

ముంబ‌యి, బ్రీచ్ కాండీ హాస్ప‌ట‌ల్‌లో భుజం ఆప‌రేష‌న్ చేయించుకున్న చిరంజీవి హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. వైద్యులు ఆయ‌న‌కు రెండువారాల‌పాటు విశ్రాంతి తీసుకోమ‌ని సూచించారు. త‌న 150వ సినిమా షూటింగ్‌కి ఎలాంటి ఆటంకం ఉండ‌కూడ‌ద‌నే, ఆయ‌న ఈ లోపే ఆప‌రేష‌న్ చేయించుకున్న విష‌యం తెలిసిందే. డ్యాన్సులు లేని చిరంజీవి సినిమాని ఎవ‌రూ ఊహించ‌లేరు కాబ‌ట్టి త‌న 150వ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలో ఆయ‌న నుండి మ‌నం అన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమా హంగుల‌నూ ఆశించ‌వ‌చ్చు. ఈ సినిమా షూటింగ్ మార్చి నెల చివ‌రివారంలో మొద‌లు కానుంది. త‌మిళ సినిమా క‌త్తిని తెలుగులోకి వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహంపై కూడా ప‌లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, ఆయ‌న త‌న అల్లుడిని సెల‌క్ట్ చేసుకున్నార‌ని స‌మాచారం. చిత్తూరుకి చెందిన ఈ వ‌రుడు అమెరికాలో సెటిల్ అయిన వ్య‌క్తి అని , పెళ్లి త‌రువాత శ్రీజ కూడా అమెరికా వెళ్లిపోతుంద‌ని తెలుస్తోంది.

First Published:  7 Feb 2016 1:56 AM GMT
Next Story