Telugu Global
National

స్నేహితుని ఇంట్లో ఢిల్లీ యూనివ‌ర్శిటీ విద్యార్థిని మృత‌దేహం!

స్నేహితుని ఇంట్లో ఢిల్లీ యూనివ‌ర్శిటీ విద్యార్థిని మృత‌దేహం! తాను మ‌రొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాత ప్రియురాలు అడ్డువ‌స్తుంద‌నే ఉద్దేశంతో ఓ  యువ‌కుడు ఆమెను అంతం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ యూనివ‌ర్శిటీలో మూడో సంవ‌త్స‌రం డిగ్రీ చ‌దువుతున్న అర్జూ సింగ్‌, ఆమె స్నేహితుడు న‌వీన్ కాత్రి ప్రేమించుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వారూ అందుకు ఒప్పుకోలేదు. అయితే ప్రేమికులు మాత్రం పెద్ద‌వారి మాట‌లు ప‌ట్టించుకోకుండా క‌లుసుకుంటూనే ఉండేవారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల రెండో తేదీన కాలేజిక‌ని వెళ్లిన అర్జూ సింగ్ ఇంటికి తిరిగి […]

స్నేహితుని ఇంట్లో ఢిల్లీ యూనివ‌ర్శిటీ విద్యార్థిని మృత‌దేహం!
X

స్నేహితుని ఇంట్లో ఢిల్లీ యూనివ‌ర్శిటీ విద్యార్థిని మృత‌దేహం! తాను మ‌రొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాత ప్రియురాలు అడ్డువ‌స్తుంద‌నే ఉద్దేశంతో ఓ యువ‌కుడు ఆమెను అంతం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ యూనివ‌ర్శిటీలో మూడో సంవ‌త్స‌రం డిగ్రీ చ‌దువుతున్న అర్జూ సింగ్‌, ఆమె స్నేహితుడు న‌వీన్ కాత్రి ప్రేమించుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వారూ అందుకు ఒప్పుకోలేదు. అయితే ప్రేమికులు మాత్రం పెద్ద‌వారి మాట‌లు ప‌ట్టించుకోకుండా క‌లుసుకుంటూనే ఉండేవారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల రెండో తేదీన కాలేజిక‌ని వెళ్లిన అర్జూ సింగ్ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె త‌ల్లిదండ్రులు పోలీస్ కంప్ల‌యింట్ ఇచ్చారు. పోలీసులు న‌వీన్ కాత్రి ఇంట్లో వెంటిలేష‌న్ ఏరియాలో అర్జూ సింగ్ మృత దేహాన్ని క‌నుగొన్నారు. కాత్రి ఈ నెల నాలుగున మ‌రొక అమ్మాయిని వివాహం చేసుకోవాల‌నుకున్న‌ట్టుగా త‌మ‌కు తెలుసున‌ని, అందుకు త‌న సోద‌రి అడ్డువ‌స్తుంద‌నే ఈ ప‌నిచేశాడ‌ని అర్జూ సింగ్ సోద‌రి ఆకాంక్ష తెలిపింది. అత‌ని వివాహానికి త‌మ సోద‌రి అడ్డుకాకుండా తాము చూసుకునేవారిమ‌ని, కానీ ఇలా అంత‌మొందించాడంటూ ఆమె ఆక్రోశించింది.

First Published:  6 Feb 2016 10:45 PM GMT
Next Story