Telugu Global
Cinema & Entertainment

నారా రోహిత్ సిక్స్‌ప్యాక్‌!

ముద్దుగా, బొద్దుగా క‌నిపించే నారా రోహిత్ త‌న తాజా చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో రాబోతున్నాడు. మ‌రీ ఎక్కువగా ఆవేశ‌ప‌డ‌కుండా, కాస్త స‌హ‌జ‌త్వాన్ని జోడించి,  స్థిరంగా న‌టించే రోహిత్ ఈ చిత్రంలో త‌న కామెడీ టైమింగ్‌ని చూపించ‌నున్నాడ‌ట‌. రోహిత్ ఈ సినిమాలో బాగా న‌వ్విస్తాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు.  త‌మిళ సినిమా మాన్ క‌రాటేకి రీమేక్‌గా తుంట‌రిని తీస్తున్నారు. ఇందులో రోహిత్ పాత్ర బాక్స‌ర్‌. అందుకే ఫిట్‌గా క‌నిపించేందుకు ఆరు కేజీల వ‌ర‌కు బ‌రువుని వ‌దిలించుకుని సిక్స్‌ప్యాక్ బాడీని సాధించాడ‌ట‌. […]

నారా రోహిత్ సిక్స్‌ప్యాక్‌!
X

ముద్దుగా, బొద్దుగా క‌నిపించే నారా రోహిత్ త‌న తాజా చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో రాబోతున్నాడు. మ‌రీ ఎక్కువగా ఆవేశ‌ప‌డ‌కుండా, కాస్త స‌హ‌జ‌త్వాన్ని జోడించి, స్థిరంగా న‌టించే రోహిత్ ఈ చిత్రంలో త‌న కామెడీ టైమింగ్‌ని చూపించ‌నున్నాడ‌ట‌. రోహిత్ ఈ సినిమాలో బాగా న‌వ్విస్తాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు. త‌మిళ సినిమా మాన్ క‌రాటేకి రీమేక్‌గా తుంట‌రిని తీస్తున్నారు. ఇందులో రోహిత్ పాత్ర బాక్స‌ర్‌. అందుకే ఫిట్‌గా క‌నిపించేందుకు ఆరు కేజీల వ‌ర‌కు బ‌రువుని వ‌దిలించుకుని సిక్స్‌ప్యాక్ బాడీని సాధించాడ‌ట‌. రోహిత్ ఈ సినిమాలో యాక్ష‌న్‌ కామెడీతో పాటు, రొమాన్స్ కూడా పండించిన‌ట్టు స‌మాచారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో ఉంది. ల‌తా హెగ్డే హీరోయిన్ కాగా గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ నెల 15న దీన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

First Published:  7 Feb 2016 3:34 AM GMT
Next Story