Telugu Global
Others

చంద్రబాబు ఎందుకు లొంగిపోయాడు?

తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థను శాసిస్తున్ననారాయణ, చైతన్యలాంటి కార్పోరేట్‌ కాలేజీలను ఈ ఏడాది దారిలోపెట్టే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. మరి ఈయన శక్తి చాలలేదో, వాళ్లదే పైచేయి అయిందో మొత్తంమీద ఈ కార్పోరేట్‌ కాలేజీలతో సర్దుకుపోయాడు. ఎన్నో ఏళ్లనుంచి నారాయణ, చైతన్య కాలేజీలలో సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరగడంలేదు. వాళ్ళు టెస్ట్‌ ట్యూబ్‌ ముట్టుకోకుండానే ప్రాక్టికల్స్‌లో నూరు శాతం మార్కులు సంపాదిస్తారు. అది ఎలాగో వాళ్లకే తెలుసు, ఇంటర్‌బోర్డ్‌ అధికారులకే తెలుసు..! నారాయణ, చైతన్య వచ్చాక ప్రభుత్వ పెద్దల […]

చంద్రబాబు ఎందుకు లొంగిపోయాడు?
X

తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థను శాసిస్తున్ననారాయణ, చైతన్యలాంటి కార్పోరేట్‌ కాలేజీలను ఈ ఏడాది దారిలోపెట్టే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. మరి ఈయన శక్తి చాలలేదో, వాళ్లదే పైచేయి అయిందో మొత్తంమీద ఈ కార్పోరేట్‌ కాలేజీలతో సర్దుకుపోయాడు.

ఎన్నో ఏళ్లనుంచి నారాయణ, చైతన్య కాలేజీలలో సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరగడంలేదు. వాళ్ళు టెస్ట్‌ ట్యూబ్‌ ముట్టుకోకుండానే ప్రాక్టికల్స్‌లో నూరు శాతం మార్కులు సంపాదిస్తారు. అది ఎలాగో వాళ్లకే తెలుసు, ఇంటర్‌బోర్డ్‌ అధికారులకే తెలుసు..!

నారాయణ, చైతన్య వచ్చాక ప్రభుత్వ పెద్దల సహకారంతో ఒక క్రమపద్ధతిలో ప్రభుత్వ ఇంటర్‌మీడియట్‌ కాలేజీలన్ని దెబ్బతిన్నాయి. కొన్ని మూతపడ్డాయి. ఇప్పుడెవరైనా పిల్లలను ఇంటర్‌మీడియట్‌లో చేర్చాలంటే నారాయణ, చైతన్యలాంటి కార్పోరేట్‌ కాలేజీలేగతి. సైన్స్‌ సబ్జెక్ట్‌లే గతి. ఆ పరిస్థితి కల్పించారు.

వాళ్లు ఆడిందే ఆట… వాళ్లు పాడిందే పాట. ప్రభుత్వాలు వెర్రివెంగళాయిల్లా తలూపాల్సిందే. వాళ్ల అనుమతి లేనిదే ఇంటర్‌మీడియట్‌ విద్యలో ఏ మార్పులు చేర్పులు జరగవు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలనుంచి ప్రభుత్వ ఇంటర్‌మీడియట్‌ కళాశాలల అధ్యాపకులు ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. లేకపోతే కార్పోరేట్‌ కళాశాలల విద్యార్ధులకు వాళ్ల కాలేజీలలో కనీసం ల్యాబోరేటరీలు కూడా లేకుండా నూటికి నూరుశాతం మార్కులు పొందుతుండగా గవర్నమెంట్‌ కాలేజీలలో విద్యార్ధులు ఏడాదిపొడవునా ప్రాక్టికల్స్‌చేసి 50, 60 శాతం మార్కులు పొందడం గగనం అవుతోంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే అందరికి తెలిసిన విషయమే. కార్పోరేట్‌ కాలేజీలు ఇంటర్‌మీడియట్‌ బోర్డును మ్యానేజ్‌చేసి తమకు కావాల్సిన వాళ్లనే ఎగ్జామినర్స్‌గా తెప్పించుకుంటారు. కావాల్సిన మార్కులు వేయించుకుంటారు.

ఇంటర్‌మీడియట్‌ మార్కులను ఎంసెట్‌ మార్కులతో కలపనంతకాలం ఎవరికీ పెద్ద ఇబ్బంది లేదుకానీ ఇప్పుడు ఇదో పెద్ద అవరోధంగా మారింది. కార్పోరేట్‌ కాలేజీల్లో చదివినవాళ్లకు ఇంటర్‌మీడియట్‌ వేయిటేజ్‌ మార్కులు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ కళాశాలల్లో చదివినవారికి ఈ మార్కులు తక్కువగా ఉండడంతో మంచి ఎంసెట్‌ ర్యాంకులు రావడం లేదు. అందుకే ఈ గగ్గోలు.

ప్రాక్టికల్స్‌లో కార్పోరేట్‌ కాలేజీల్లో చదివిన విద్యార్ధుల సత్తా తెలియాలంటే ఒక కళాశాలవాళ్లను ఇంకో కాలేజీకి పంపించి పరీక్షలు జరిపితే (దీన్నే జంబ్లింగ్‌ అంటారు) అసలు రంగు బయటపడుతుంది. ప్రతి ఏడాది జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పడం తీరా పరీక్షలు దగ్గరకొచ్చాక ఈ ఏడాదికాదు వచ్చే ఏడాదినుంచి అనడం అలవాటుగా మారిపోయింది.

ఈ ఏడాది తెలంగాణలో జంబ్లింగ్‌ లేదని విద్యాశాఖామంత్రి ఎప్పుడో చెప్పేశాడు. గతంలో ఆయన విద్యాశాఖామంత్రిగా చేసిన అనుభవంతో కార్పోరేట్‌ కాలేజీలతో జాగ్రత్తగా సర్దుకుపోయాడు.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జోక్యం చేసుకుని ఈ ఏడాదినుంచి జంబ్లింగ్‌ విధానం అమలు జరపాల్సిందేనని హూంకరించాడు. ఎవరెన్ని చెప్పినా ససేమిరా అన్నాడు. ఏం జరిగిందో కానీ చివరికి ఈ ఏడాది జంబ్లింగ్‌ లేదు అని ప్రకటించాడు.

ఈ తంతుకు ప్రజలంతా అలవాటుపడ్డారు. కార్పోరేట్‌ కాలేజీలను ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేవన్న విషయం ప్రజలందరికి తెలుసు. కాబట్టి ఇక ఈ డ్రామాలు కట్టిపెట్టి ఎంసెట్‌ ర్యాంకులు నిర్ణయించడంలో ఇంటర్‌మీడియట్‌ మార్కులను కలపకుండా ఉంటే చాలు… ఈ మేలుచేయండి అని… ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

Click on image to Read

jagan

tdp-media

muralimohan

babu-ghmc-elections

ts-tdp

revanth-reddy

collector

JC-Prabhakar-Reddy1

revanth-reddy

First Published:  6 Feb 2016 7:02 PM GMT
Next Story