Telugu Global
Cinema & Entertainment

నితిన్, రకుల్ సినిమాకి దర్శకుడు దొరికాడు

ఈ ఏడాది ఫస్ట్ డే ఫస్ట్ హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. రామ్ ను హీరోగా పెట్టి అతడు తీసిన నేను శైలజ సినిమా బాగా ఆడింది. రామ్ కు ఓ హిట్ ఇచ్చాడు. దర్శకుడిగా కిషోర్ తిరుమల కూడా హిట్టయ్యాడు. దీంతో అతగాడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా శర్వానంద్, నాగచైతన్య లాంటి హీరోలు కిషోర్ తిరుమల కోసం ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా ఆ అవకాసం నితిన్ కు దక్కింది. తన […]

నితిన్, రకుల్ సినిమాకి దర్శకుడు దొరికాడు
X

ఈ ఏడాది ఫస్ట్ డే ఫస్ట్ హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. రామ్ ను హీరోగా పెట్టి అతడు తీసిన నేను శైలజ సినిమా బాగా ఆడింది. రామ్ కు ఓ హిట్ ఇచ్చాడు. దర్శకుడిగా కిషోర్ తిరుమల కూడా హిట్టయ్యాడు. దీంతో అతగాడితో సినిమా చేసేందుకు చాలామంది హీరోలు ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా శర్వానంద్, నాగచైతన్య లాంటి హీరోలు కిషోర్ తిరుమల కోసం ప్రయత్నించారు. కానీ ఫైనల్ గా ఆ అవకాసం నితిన్ కు దక్కింది. తన నెక్ట్స్ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలోనే ఉంటుందని నితిన్ ప్రకటించాడు. అంతేకాదు… తన సొంతబ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మిస్తానని కూడా ప్రకటించాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే అంశంపై కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే…. ఈమధ్యే రకుల్ ప్రీత్ సింగ్ కు భారీగా అడ్వాన్స్ ముట్టజెప్పాడు నితిన్. తన సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వచ్చినా… అందులో రకులే హీరోయిన్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా స్టార్ హీరోయిన్ ను, క్రేజీ దర్శకుడ్ని లైన్లోపెట్టి నెక్ట్స్ సినిమాను పక్కా చేసుకున్నాడు నితిన్.

First Published:  7 Feb 2016 12:00 AM GMT
Next Story